కోల్పోయినవి లభిస్తాయట!

మహిష్మతీ నగరానికి చెందిన హైహయ వంశస్థుడైన కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యార్జునుడు. అతడికి సహస్రబాహు, అర్జున, సహస్రార్జున అనే పేర్లూ ఉన్నాయి. భార్య మనోరమ.

Published : 23 Feb 2023 00:15 IST

హిష్మతీ నగరానికి చెందిన హైహయ వంశస్థుడైన కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యార్జునుడు. అతడికి సహస్రబాహు, అర్జున, సహస్రార్జున అనే పేర్లూ ఉన్నాయి. భార్య మనోరమ. గురువు కృతయుగానికి చెందిన దత్తాత్రేయుడు. పుట్టుకతోనే అవిటివాడైన కార్తవీర్యార్జునుడు ఘోర తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి మెప్పించాడు. స్వామి అనుగ్రహంతో సహస్ర బాహువులు పొందాడు. అమిత పరాక్రమవంతుడు అయ్యాడు. మరణం అనివార్యం కనుక, తనంతటి వాడి చేతిలోనే మరణించాలి అని కోరుకున్నాడు. తదనంతర కాలంలో విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు సంహరించాడు. కార్తవీర్యార్జునుడికి వేయి చేతులున్నందున...

ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః
కార్తవీర్యార్జునోనామ రాజా బహు సహస్రవాన్‌
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే

అనే శ్లోకాన్ని గనుక జపిస్తే.. పోగొట్టుకున్న ధనం, వస్తువులు, ఉద్యోగం.. ఇలా వేటినైనా తిరిగి పొందుతారని విశ్వసిస్తారు.

పరాశరం సచ్చిదానందమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని