ద్వేషించేవాడే ప్రేమించాడు

అతడో మత విద్వేషి. తాను నమ్మిన సిద్ధాంతాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు. అవును క్రీస్తు బోధలను ద్వేషించి వ్యతిరేక భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలకు కాపలా సైనికుడిలా పనిచేశాడు

Published : 02 Mar 2023 00:37 IST

అతడో మత విద్వేషి. తాను నమ్మిన సిద్ధాంతాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాడు. అవును క్రీస్తు బోధలను ద్వేషించి వ్యతిరేక భావాలు, సూత్రాలు, సిద్ధాంతాలకు కాపలా సైనికుడిలా పనిచేశాడు. ప్రభువును నమ్మిన ప్రజలను బాధించాడు. ఒకసారి దమస్కో నగరంలోని క్రీస్తు భక్తులపై దాడి చేసేందుకు గుర్రంమీద వెళ్తుండగా ఒక కాంతిపుంజం దూసుకొచ్చి విసిరికొట్టింది. ‘నన్నెందుకిలా హింసిస్తున్నావ్‌?’ అంటూ ఓ స్వరం గర్జించింది. ఆ వెలుగు, స్వరం క్రీస్తువే. అంతే... అతడు మూడు రోజులపాటు కళ్లు తెరవలేదు. అన్నం ముట్టలేదు. ఆ స్వరం వెంటాడింది. పశ్చాత్తాపం చెంది మారిపోయాడు. అతడెవరో కాదు తార్సు పట్టణ వాసి సౌలు. రోమ్‌కు నివాసం మారడంతో పౌలు అయ్యాడు! నాడు అనేక విద్యల్లో సుశిక్షితుడు, నేడు ప్రభువనే కవచం పట్టాడు. చైతన్య గళం విప్పాడు. ఒక విద్వేషి ప్రభు ప్రేమలోకి దిగిన అపురూప ఘట్టం.                
డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు