అనాథకు కానుకగా..

ఓ వ్యక్తి ఖర్జూర తోట విషయమై దైవప్రవక్త (స) వారి న్యాయస్థానంలో కేసు పెట్టాడు. అతడికి నా అన్నవాళ్లెవరూ లేరు. ఆ తోట తనదేనని నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలు ఏవీ సమర్పించలేకపోయాడు.

Published : 09 Mar 2023 00:05 IST

వ్యక్తి ఖర్జూర తోట విషయమై దైవప్రవక్త (స) వారి న్యాయస్థానంలో కేసు పెట్టాడు. అతడికి నా అన్నవాళ్లెవరూ లేరు. ఆ తోట తనదేనని నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలు ఏవీ సమర్పించలేకపోయాడు. అందువల్ల ప్రవక్త ఆ తోటను ప్రతివాదికి ఇచ్చేశారు. దాంతో ఆ అనాథ ఏడవ సాగాడు. అది చూసిన ప్రవక్తకు జాలేసింది. ‘నువ్వు ఆ ఖర్జూర తోటను ఇతడికి ఇచ్చేయ్‌! దీనికి బదులుగా దేవుడు నీకు స్వర్గం ప్రసాదిస్తాడు’ అన్నారు. కానీ అందుకు అతడు అంగీకరించలేదు. ఆ సమయంలో అక్కడే ఉన్న అబూదహ్దా అనే అనుచరుడు కల్పించుకుని ‘ఈ తోటను నాకు గనుక ఇస్తే.. నేను ఫలానా తోటను నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నీకు సమ్మతమేనా?’ అనడిగారు. నిజానికది మరింత ఖరీదైన తోట. అతడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అలా తన పేరున బదిలీ చేసుకున్న తోటను అనాథకు కానుకగా ఇచ్చేసి అతడి దుఃఖం తీర్చారు.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు