నెమ్మది లేకుంటే అంతా వ్యర్థం

కొన్ని కుటుంబాల్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో అకారణంగా పెడసరంగా మాట్లాడుతూ చీటికి మాటికీ పోట్లాడుకుంటారు.

Published : 09 Mar 2023 00:07 IST

కొన్ని కుటుంబాల్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో అకారణంగా పెడసరంగా మాట్లాడుతూ చీటికి మాటికీ పోట్లాడుకుంటారు. ఫలితంగా ఇల్లంతా గందరగోళంగా, అశాంతిగా ఉంటుంది. ఈ తరహా వ్యక్తుల గురించి సొలొమోను మహా రాజు- ‘ఎంత రుచికరమైన ఆహారం తినే అవకాశం ఉన్నప్పటికీ.. కలహించుకునే ఇంట్లో ఉండటం కంటే.. ప్రశాంతత ఉన్న ఇంట్లో మామూలు రొట్టెముక్క తినడం ఉత్తమం. ఇంట్లో మనశ్శాంతి, నెమ్మదితనం కనుక లేకపోతే ఎన్ని సంపదలున్నా వ్యర్థమే. అందువల్ల అందరితో స్నేహంగా, ప్రేమగా ఉండాలి’ అంటూ రాశాడు తన సామెతల గ్రంథంలో.

జి. ప్రశాంత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని