వాక్‌ భోజనం

దేవుడి మాట, నిత్య జీవపు ఊట. చల్లటి వెలుగుల బాట. మన మనసును రక్షించే కోట. దైవ వాక్యం ఆత్మీయ భోజనం, దివ్యమైన ఆహారం! ఐహిక సుఖాలకు భిన్నమైంది.

Published : 16 Mar 2023 00:39 IST

దేవుడి మాట, నిత్య జీవపు ఊట. చల్లటి వెలుగుల బాట. మన మనసును రక్షించే కోట. దైవ వాక్యం ఆత్మీయ భోజనం, దివ్యమైన ఆహారం! ఐహిక సుఖాలకు భిన్నమైంది. లెంట్‌ దినాల్లో ఏసు ప్రభువు 40 రోజుల పాటు దైవ ధ్యానంలో ఉన్నందున బాగా ఆకలితో ఉన్నాడు. ఆయనలో దైవ శక్తులెన్నో ఉన్నాయని తెలుసుకున్నాడు సాతానుడు. అతడు ఒక పథకం ప్రకారం శోధించటానికి వచ్చాడు. దాంతో ఏదో సాధించాలనుకున్నాడు. ఏసును ఎత్తయిన కొండమీదికి తీసుకెళ్లి ‘నీకు ఆకలిగా ఉంది కదా! ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకుని తినేస్తావా?’ అన్నాడు. దానికి ప్రభువు ‘మనం కేవలం రొట్టెల వలే బతకం! దేవుడి నుంచి వచ్చే వాక్యాల వల్ల కూడా బతికేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చాడు. మానవత్వాన్ని పెంపొందించుకోవాలని చెప్పడానికే ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. మాయలూ, మోసాలతో జీవించడాన్ని సదా ఖండించాడు. అందుకే ఎన్ని శతాబ్దాలు గడిచినా, లోకంలో ఎన్ని మార్పులు సంభవించినా ఏసు ఆధ్యాత్మిక విప్లవకారుడిగా కనిపిస్తాడు. 

డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని