స్వర్గం.. అమ్మ పాదాల చెంత

ఒకసారి ఓ వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి ‘అయ్యా! నా కారణంగా చాలా పెద్ద పాపకార్యం జరిగిపోయింది. దానికి ప్రాయశ్చిత్తం ఉంటే కాస్త సూచించండి’ అనడిగాడు.

Published : 16 Mar 2023 00:39 IST

కసారి ఓ వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చి ‘అయ్యా! నా కారణంగా చాలా పెద్ద పాపకార్యం జరిగిపోయింది. దానికి ప్రాయశ్చిత్తం ఉంటే కాస్త సూచించండి’ అనడిగాడు. దానికి ప్రవక్త ‘నీ మాతృమూర్తి జీవించే ఉందా?’ అని వాకబు చేశారు. లేదని జవాబు చెప్పాడతను. ‘పోనీ నీకు పినతల్లి ఉందా? ఒకవేళ ఉంటే ఆమె పట్ల ప్రేమ, దయ, ఆదరణ చూపిస్తూ మంచిగా ఉండు’ అంటూ ఉపదేశించారు. అంతలో మరో సహచరుడు వచ్చి ‘అయ్యా! ధర్మయుద్ధంలో పాల్గొనాలన్నది నా అభిలాష. అది మంచిదేనా?’ అనడిగాడు. ‘మీ తల్లి బతికే ఉందా?’ ఈసారి కూడా అదే ప్రశ్న అడిగారు ప్రవక్త. దానికతను బతికే ఉందని బదులిచ్చాడు. ‘అయితే నువ్వు ఆమెను అంటిపెట్టుకుని ఉండు. స్వర్గం ఆమె పాదాల చెంతనే ఉంది’ అన్నారు దయామూర్తి.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని