ఆత్మ నివేదన

తనువే కోవెల, జీవాత్మే పరమాత్మ- అన్నాడు సాయిబాబా. ‘మనలోని జీవాన్ని బాధపెడితే దైవాన్ని బాధపెట్టినట్టే.

Published : 30 Mar 2023 00:17 IST

నువే కోవెల, జీవాత్మే పరమాత్మ- అన్నాడు సాయిబాబా. ‘మనలోని జీవాన్ని బాధపెడితే దైవాన్ని బాధపెట్టినట్టే. ఫలహారం సేవించిన తర్వాతే సాధన మొదలు పెట్టాలి. లేదంటే ఆకలి మీద ధ్యాస కార్యసాధనకు అడ్డువస్తుంది. ఆత్మారాముణ్ణి సంతృప్తి పరచి, ఆనక దైవాన్ని ధ్యానించండి’ అంటూ హితవు పలికాడు సాయి.

ఒకసారి ఏకాదశి ప్రస్తావన వచ్చినప్పుడు.. ‘పక్షానికి ఒకసారి వచ్చే ఏకాదశి నాడు ఉపవసించి శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఉపవాసం అంటే శరీరాన్ని బాధపెట్టడం కాదు. పాలూ, పండ్లతో శుష్కించకుండా కాపాడుకుంటూ దైవచింతనలో గడపడం. మనకున్న దాంట్లో భక్తిశ్రద్ధలతో, నిష్కల్మష హృదయంతో నిస్సహాయులకు సమర్పిం చాలి. దైవాన్ని స్మరించుకుంటూ, చేతనైనంతలో తోటివారికి సాయం చేస్తూ ధర్మబద్ధంగా నడచు కోవాలి. మనమెంత నిరాడంబరంగా, స్వచ్ఛంగా ఉంటే భగవంతుడి అనుగ్రహం అంత త్వరగా కలుగు తుందని అర్థమ వుతుంది. ఆర్తితో, ఆర్ద్రతతో పిలిస్తే భగవంతుడు అక్కున చేర్చుకుంటాడు. మనకేం కావాలో కాదు, ఏమివ్వాలో భగవంతుడికి తెలుసు. హడావుడీ, ఆర్భాటాలు కాదు.. నిర్మల చిత్తంతో హృదయపుష్పాన్ని అర్పించినప్పుడే జీవితానికి సార్థకత కలుగుతుంది’ అంటూ ప్రబోధించాడు సాయిబాబా.

కొండూరి పద్మపార్వతీశం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని