ప్రభువు హెచ్చరిక

పౌలు తన కుమారుడు తిమోతితో ‘యవ్వన ఇచ్ఛల నుంచి పారిపో’ (తిమోతి 2:22) అన్నాడు. అది మనం అనుసరించాల్సిన సందేశం.

Published : 20 Apr 2023 00:42 IST

పౌలు తన కుమారుడు తిమోతితో ‘యవ్వన ఇచ్ఛల నుంచి పారిపో’ (తిమోతి 2:22) అన్నాడు. అది మనం అనుసరించాల్సిన సందేశం. దేవుడు స్త్రీపురుషుల్లో పరస్పర ఆకర్షణ కలిగించాడు. అది వంశాభివృద్ధికీ, సంసారసుఖానికీ మాత్రమే పరిమితం. కానీ సాతాను దాన్ని వక్రీకరించి విభిన్న దారుల్లో ఆనందం పొంద వచ్చునంటూ పాపానికి హేతువుగా మార్చాడు. పాన్పు పవిత్రంగా ఉండాలన్నది బైబిల్‌ (హెబ్రీ 13:4) వాక్యం. పై రెండు వచనాలూ మనం పెడతోవ పట్టకుండా కాపాడతాయి. క్షణికాకర్షణకు ప్రేమ, త్యాగం అంటూ ముద్దు పేర్లు పెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్న యువతకు తగుమాత్రపు వస్త్రధారణ గురించి (తిమోతి 2:9) ప్రభువు హెచ్చరించాడు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తు చెప్పిన మరో మంచి మాట ‘దేవుడిచ్చిన నేత్ర ద్వయాన్ని మనమంతా పవిత్రంగా ఉపయోగించాలి. చూపు కనుక చెడిపోయిందంటే దేహమంతా చెడిపోయినట్లే’ (మత్తయి 5:28) అన్న సూక్తిని సదా మననం చేసుకోవాలి. పర స్త్రీలను మోహపు చూపు చూడటం కూడా అంతరంగంలో పాపం చేసినట్లే నన్నాడు ప్రభువు. కనుక ప్రతి ఒక్కరూ మనసా వాచా కర్మణా పవిత్రంగా ఉండాలన్నదే ఏసు ఉవాచ. ఆయన మాటలు పాటించి ఆదర్శప్రాయంగా జీవించాలి. 

 మర్రి ఎ.బాబ్జీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు