అల్లాహ్‌ మార్గం

ఒకరోజు ప్రవక్త (స) తన సహచరులతో కలిసి వెళ్తుంటే ఓ వ్యక్తి తారసపడ్డాడు. అతను కష్టపడి పనిచేస్తాడని తెలిసిన సహచరులు ‘ఇతను పడే శ్రమ అల్లాహ్‌ మార్గంలో అయ్యుంటే గనుక ఎంత బావుండేది?’ అన్నారు నిట్టూరుస్తూ.

Published : 27 Apr 2023 00:38 IST

కరోజు ప్రవక్త (స) తన సహచరులతో కలిసి వెళ్తుంటే ఓ వ్యక్తి తారసపడ్డాడు. అతను కష్టపడి పనిచేస్తాడని తెలిసిన సహచరులు ‘ఇతను పడే శ్రమ అల్లాహ్‌ మార్గంలో అయ్యుంటే గనుక ఎంత బావుండేది?’ అన్నారు నిట్టూరుస్తూ. అది విన్న కారుణ్యమూర్తి (స) ‘అతడు తన తల్లిదండ్రుల పోషణార్థం శ్రమిస్తున్నట్లయితే అల్లాహ్‌ మార్గంలో కష్టపడుతున్నట్లే. భార్యాపిల్లల్ని పోషించేందుకు పాట్లు పడుతుంటే అది కూడా అల్లాహ్‌ మార్గంలో శ్రమిస్తున్నట్లే. లేదూ తనను తాను పోషించుకోవడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడంటే అప్పుడూ అల్లాహ్‌ మార్గంలో పరిశ్రమిస్తున్నట్లే. కానీ.. పేరుప్రఖ్యాతుల కోసమో, దర్జాలూ దర్పాలు ప్రదర్శించుకోవాలనో, అహంకారాన్ని చాటుకోవడానికో కష్టపడుతుంటే మాత్రం అతడు సైతాన్‌ మార్గంలో కష్టపడుతున్నట్లు’ అంటూ వివరించారు ప్రవక్త.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు