ఛత్రపతిని తీర్చిదిద్దిన చరితార్థ

రాజమాతకు అవి తుది క్షణాలని తెలిసింది.. విషయం తెలిసిన చక్రవర్తి శర వేగంగా అక్కడికి వచ్చాడు. తల్లిని అనుక్షణం కంటికి రెప్పలా చూసు కొమ్మని ఆస్థాన వైద్యుల్ని ఆదేశించాడు.

Published : 04 May 2023 00:11 IST

రాజమాతకు అవి తుది క్షణాలని తెలిసింది.. విషయం తెలిసిన చక్రవర్తి శర వేగంగా అక్కడికి వచ్చాడు. తల్లిని అనుక్షణం కంటికి రెప్పలా చూసు కొమ్మని ఆస్థాన వైద్యుల్ని ఆదేశించాడు. కానీ ఆ సూచనల్ని సున్నితంగా తిరస్కరిస్తూ ‘నాయనా! నాకే వైద్యమూ అవసరం లేదు. నేనిక సెలవు తీసుకునే సమయం ఆసన్నమైంది’ అంటూ కుమారుణ్ణి ఆశీర్వదించింది మాతృమూర్తి. అంతటి మహాచక్రవర్తి కూడా పసిపిల్లాడిలా తల్లడిల్లిపోయాడు. ‘నువ్వు లేకుండా ఎలా జీవించనమ్మా? రాజ్యపాలన ఎలా చేయగలను?’ అంటూ పాదాలపై మోకరిల్లాడు. ఆ స్థితిలోనూ ఆ వీరమాత ‘నాయనా! దిగులెందుకు? నేనెక్కడికీ వెళ్లటంలేదు. దేశంలోని ప్రతి స్త్రీమూర్తిలో నీకు కనిపిస్తూనే ఉంటాను. ఈ మట్టిలో, గాలిలో నా ఆత్మ మమేకమయ్యే ఉంటుంది. ఈ దేశ ఔన్నత్యం కోసం, అభ్యుదయం కోసం పాటుపడే బిడ్డల్ని కని పెంచే ప్రతి మాతృమూర్తినీ నా ఆత్మ చైతన్యపరుస్తూనే ఉంటుంది. కన్నబిడ్డల్ని ధీరులుగా, వీరులుగా, దేశభక్తులుగా తీర్చిదిద్దేందుకు అదృశ్య ప్రేరకశక్తిగా నిలుస్తూనే ఉంటాను’ అని చెబుతూనే పుత్రుడి ఒడిలో ఒరిగిపోయింది. ఆ రాజమాత జిజియాబాయి. ఆ చక్రవర్తి ఛత్రపతి శివాజీ. ఆమె భారతచరిత్రలో ఆదర్శ మాతృమూర్తి. ఒక తల్లి తలచుకుంటే పుత్రుణ్ణి ఎంతటి వీరుడిగా తీర్చిదిద్దగలదో నిరూపించిన చైతన్యస్ఫూర్తి.

 ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు