స్వర్గంలో ఇల్లు

ఒక వ్యక్తి మిత్రుణ్ణి కలవడానికి ఊరెళ్తున్నాడు. అల్లాహ్‌ ఆజ్ఞతో దైవదూత అతన్ని కలిసి ‘ఎక్కడికెళ్తున్నావు, ఎందుకు?’ అనడిగాడు.

Published : 11 May 2023 00:38 IST

ఒక వ్యక్తి మిత్రుణ్ణి కలవడానికి ఊరెళ్తున్నాడు. అల్లాహ్‌ ఆజ్ఞతో దైవదూత అతన్ని కలిసి ‘ఎక్కడికెళ్తున్నావు, ఎందుకు?’ అనడిగాడు. తానెవరిని కలవడానికి వెళ్తున్నాడో చెప్పాడతడు. ‘అతడి నుంచి నువ్వేమైనా ఆశిస్తున్నావా?’ అంటే.. ‘లేదు, అల్లాహ్‌ మీదున్న అభిమానంతో అతడి వద్దకు వెళ్తున్నాను’ అని బదులిచ్చాడు. దానికాయన ‘నేను దైవదూతను, శుభవార్త అందజేయడానికి వచ్చాను. నువ్వు దేవుడి నిమిత్తం ఆ వ్యక్తిని ప్రేమించావు. కనుక అల్లాహ్‌ నిన్ను తన సన్నిహితుల్లో చేర్చుకున్నాడు’ అన్నాడు. ముహమ్మద్‌ ప్రవక్త తన సహచరులకు చెప్పిన ఈ గాథ ప్రవక్త ప్రవచనాల బుఖారీ గ్రంథం లోనిది.

కపటం, కల్మషం లేకుండా, నిస్వార్థంగా స్నేహం చేసేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు, ఆదరిస్తాడన్నది దీని సారాంశం. బంధుమిత్రులెవరైనా అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు వారిని పరామర్శించడానికి వెళ్లిన వ్యక్తిని ‘నీకు శుభం కలుగుగాక! నువ్వు చాలా అదృష్టవంతుడివి. స్వర్గంలో ఇల్లు నిర్మించు కున్నావు’ అని దైవదూత ఆశీర్వదిస్తాడు’ అంటూ వివరించారు ప్రవక్త.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు