యెహోవాయే మన కాపరి

కీర్తన 23:1లో దేవుడైన యెహోవాయే మనకు కాపరిగా ఉన్నాడని చెప్పాడు దావీదు. గొర్రెల కాపరి వాటిని చక్కగా నడిపించినట్లు దేవుడు మనల్ని నడిపిస్తాడు.

Published : 11 May 2023 00:36 IST

కీర్తన 23:1లో దేవుడైన యెహోవాయే మనకు కాపరిగా ఉన్నాడని చెప్పాడు దావీదు. గొర్రెల కాపరి వాటిని చక్కగా నడిపించినట్లు దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనల్ని గొర్రెలతో ఎందుకు పోల్చడ మంటే అన్నిటికంటే అవి అమాయక ప్రాణులు. కాస్తయినా వివేకం లేదు. ముందు నడుస్తున్నది గోతిలో పడినా వెనుకున్నవి అనుసరిస్తాయే తప్ప పక్కకు మళ్లవు. బయటకు రాలేవు కూడా. వాటి శరీరం స్వీయరక్షణకు అనుకూలం కాదు. వాడిగా ఉండే గోళ్లూ, కొమ్ములూ లేవు. ఒకదాన్ని చంపినా తక్కినవి తప్పించుకోవు. అందుకే మనం పాపపు ఊబిలో పడకుండా ప్రశాంతమైన కొలను వద్దకు అంటే స్వర్గానికి దారి చూపుతున్నాడు యెహోవా. కనుక 4వ వచనంలో చెప్పినట్లు మనం గాఢాంధకార లోయలో ఉన్నా భయపడాల్సిన పనిలేదు. ‘నేను గొర్రెలకు మంచి కాపరిని. వాటికి నేను, నాకవి తెలుసు. గొర్రెల కోసం ప్రాణం పెడతాను’ (యెహోవా 10:11) అనే సందేశాన్ని సదా గుర్తుంచుకుని నిబ్బరంగా ఉంటే చాలు.. ప్రభువు మనల్ని రక్షించేందుకు సిద్ధంగా ఉంటాడు.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు