లక్ష్మీప్రదం

మహాలక్ష్మి చంచల మనస్కు రాలిగా ప్రసిద్ధం. అందుకే గోవు పృష్ఠ భాగంలో (తోక వద్ద) ఉండేలా లక్ష్మి వరం పొందింది. గోవునీ, తులసీమాతనీ పూజించే ఇళ్లలో లక్ష్మి కొలువై ఉంటుంది.

Updated : 18 May 2023 05:07 IST

మహాలక్ష్మి చంచల మనస్కు రాలిగా ప్రసిద్ధం. అందుకే గోవు పృష్ఠ భాగంలో (తోక వద్ద) ఉండేలా లక్ష్మి వరం పొందింది. గోవునీ, తులసీమాతనీ పూజించే ఇళ్లలో లక్ష్మి కొలువై ఉంటుంది. ఆ అవకాశం లేనివాళ్లు పటం లేదా ప్రతిమ రూపంలో ఆరాధించవచ్చు. భక్తిశ్రద్ధలున్నచోట లక్ష్మి ఉంటుంది. సాత్విక భావనలో లక్ష్మి ఉంటుంది. దయగల హృదయంలో లక్ష్మి ఉంటుంది. గుమ్మం ముందు ముగ్గులు, ఇంట్లో దీపారాధన లక్ష్మీప్రదం. తినేటప్పుడు మొదటి ముద్దను దైవార్పణం అనుకుంటే ఆహారం అమృతతుల్యమౌతుంది. పర్వదినాల్లో పూజకి కావలసిన పూలూ పత్రాల్లాంటివి భక్తిశ్రద్ధలతో అమర్చడమే ముఖ్యం తప్ప ఆర్భాటాలు కావు. ఏ ఇంటి లోగిలి పరిశుభ్రంగా ఉంటుందో, ఎవరు ప్రసన్నంగా ఉంటూ కుటుంబ శ్రేయస్సు దిశగా పరిశ్రమిస్తారో, నిస్సహాయులకు చేతనైన సాయం చేస్తారో.. ఆ ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది.

కొండూరి పద్మపార్వతీశం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు