40 ఏళ్లు ముందే స్వర్గప్రవేశం
అబ్దుల్లా బిన్ అమ్ర్‌బిన్ ఆస్ (రజి) ఓ సందర్భంలో ‘నేను మదీనాలో ఉండగా కొందరు పేదలు మస్జిద్‌లో వలయాకారంలో కూర్చున్నారు. అంతలో దైవప్రవక్త (స) వచ్చి వాళ్లవద్ద కూర్చున్నారు.
అబ్దుల్లా బిన్ అమ్ర్‌బిన్ ఆస్ (రజి) ఓ సందర్భంలో ‘నేను మదీనాలో ఉండగా కొందరు పేదలు మస్జిద్‌లో వలయాకారంలో కూర్చున్నారు. అంతలో దైవప్రవక్త (స) వచ్చి వాళ్లవద్ద కూర్చున్నారు. దాంతో నేను కూడా వారితోపాటు కూర్చున్నాను. వాళ్లనుద్దేశించి దైవప్రవక్త (స) ‘నిరుపేదలైన మీ అందరికీ శుభవార్త! మీరు ధనికులకన్నా 40 ఏళ్ల ముందే స్వర్గంలో ప్రవేశిస్తారు’ అంటూ చెప్పారు. అది విని వాళ్ల ముఖాలు వెలిగిపోయాయి. ‘నేను కూడా ఈ వర్గంలో ఉంటే ఎంత బాగుండేది’ అనుకున్నాను. ప్రవక్త తరచూ ‘దేవా! బతికినంతకాలం నన్ను నిరుపేదగానే ఉంచు. అలాగే తీసుకెళ్లు. హష్ర్ (మైదానం)లో నిరుపేదలతోపాటే ఉంచు’ అని వేడుకునేవారు. ‘ప్రభూ! తమరు ఎందుకిలా కోరుకుంటున్నారు?’ అని హజ్రత్ ఆయిషా (రజి) అడగగా, ‘ఎందుకంటే వీళ్లు ధనికులకన్నా ముందే స్వర్గం చేరతారు మరి’ అని బదులిచ్చారు. తర్వాత ‘ఆయిషా! నిరుపేదలు యాచిస్తే వట్టి చేతులతో ఎన్నడూ తిప్పి పంపకు, ఒక ఖర్జూర ముక్కయినా ఫరవాలేదు, ఇచ్చి పంపించు’ అన్నారు’ అంటూ చెప్పారు.
ముహమ్మద్ ముజాహిద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..