అంతా ఉత్తమమే!
జపాన్ టోక్యో నగరంలో సెన్సోజీ మందిరం ఉంది. జెన్ గురువు బాంజాన్ ఉండేది అక్కడే. చాలాసేపు ధ్యానం చేసిన తర్వాత మాస్టర్‌కు కాసేపు అలా తిరిగివద్దామనిపించింది. ఆలయం నుంచి బయటికొచ్చి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడాయన.
జపాన్ టోక్యో నగరంలో సెన్సోజీ మందిరం ఉంది. జెన్ గురువు బాంజాన్ ఉండేది అక్కడే. చాలాసేపు ధ్యానం చేసిన తర్వాత మాస్టర్‌కు కాసేపు అలా తిరిగివద్దామనిపించింది. ఆలయం నుంచి బయటికొచ్చి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడాయన. కొంత దూరం తర్వాత ఒక మాంసం కొట్టు ఎదురైంది. అక్కణ్ణించి మాటలు పెద్దపెట్టున వినిపిస్తున్నాయి.
‘ఇదిగో చూడు బాబూ! నీ దగ్గరున్న దాంట్లో మంచి మాంసాన్నే ఇవ్వు నాకు’ అంటూ అడుగు తున్నాడో కొనుగోలుదారు.
‘అదేం మాట.. నా అంగట్లో ఉన్నదంతా వంక పెట్టడానికి వీల్లేనంత మంచిదే.. కావాలంటే తమరు పరిశీలించి చూసుకోండి.. బాగోలేని మాంసం.. ఒక్క ముక్క కూడా ఇక్కడ దొరకదు తెలుసా?!’ అంటూ ఎంతో ధీమాగా బదులిచ్చాడు మాంసం అమ్మే వ్యక్తి.
ఈ మాటలు విన్న బాంజాన్‌కు జ్ఞానోదయ మయ్యింది. ‘మాంసం ముక్కలే అంత మంచిగా ఉండేట్లు అతడు జాగ్రత్తపడుతున్నాడంటే... దుర్గుణాలు ఏవీ మనసుకు అంటకుండా మంచితనాన్ని కాపాడుకోవడం ఏమంత కష్టం’ అనుకున్నాడు. హాయిగా నవ్వుతూ ముందుకు సాగిపోయాడు.
వి.నాగరత్న
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్‌లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..