వెన్నంటి రక్షిస్తాడు

మన కష్టనష్టాల గురించి ఎవరికి చెప్పాలి? మన మొర వినేవారు ఎవరుంటారు? ఎవరి బాధ వారిదే కదా... అని లోలోపలే కుమిలిపోయేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. ‘నాతో చెప్పుకోండి, మీ సమస్య నేను పరిష్కరిస్తాను’ అంటూ భరోసా ఇచ్చేవారు

Updated : 01 Jun 2023 00:36 IST

న కష్టనష్టాల గురించి ఎవరికి చెప్పాలి? మన మొర వినేవారు ఎవరుంటారు? ఎవరి బాధ వారిదే కదా... అని లోలోపలే కుమిలిపోయేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. ‘నాతో చెప్పుకోండి, మీ సమస్య నేను పరిష్కరిస్తాను’ అంటూ భరోసా ఇచ్చేవారు గనుక మన ఎదుట ఉంటే ఇక ఆ ఆనందానికి అవధులుంటాయా? కానీ అలా అనేవారెవరు? అలాంటివాళ్లు ఎక్కడైనా ఉంటారా.. అంటే తప్పకుండా ఉన్నారు. ‘నాకు మొర పెట్టుకోండి.. నేను జవాబిస్తాను. నువ్వు గ్రహించలేని అనేక జటిల సంగతులను, గూఢమైన అంశాలను నీకు తెలియజేస్తాను’ (ఇర్మీయా:33:3) అన్నాడు ప్రభువు.

‘కష్టనష్టాల జీవనయానంలో, అయోమయ పరిస్థితుల్లో, క్లిష్ట సందర్భాల్లో మీ సమస్య ఏమిటో నాతో చెప్పు కోండి! ఇలా పిలిస్తే చాలు, అలా పలుకుతాను’ అని ఇర్మీయా ప్రవక్తతో సాక్షాత్తు దేవుడే చెప్పాడు. అంతే కాదు, అర్థం కాని విషయాలను ప్రభువు తేటతెల్లం చేస్తాడని ఆ వాక్యాలు వివరిస్తు న్నాయి. అలా చెప్పేసి ఇక తన బాధ్యత తీరింది అనుకోడు. (కీర్తనలు:91:4) ఆయన తన రెక్కల కింద మనకు ఆశ్రయం కల్పిస్తాడు.

ప్రభువు మనకు తోడూ నీడగా ఉంటానని, అనుక్షణం రక్షిస్తూనే ఉంటానని ప్రకటించాడు. (ఆదికాండం:28:15)

డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని