విశ్వాసంతో పయనించాలి..

అందుకోలేని వాటిపై ఆశలు పెంచుకుని నిరుత్సాహానికి గురికాకూడదు. సాధ్యాసాధ్యాలు చూసుకుని, దేవుడిపై విశ్వాసంతో ముందుకు సాగాలి. లేనిపోని ఆశలనేవి అనర్థాలకు దారితీస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గించుకుని, ప్రశాంతత అలవరచుకోవాలి.. ఇవి బైబిల్‌లో లిఖితమైన మాటలు.

Published : 30 May 2024 00:05 IST

క్రీస్తువాణి

అందుకోలేని వాటిపై ఆశలు పెంచుకుని నిరుత్సాహానికి గురికాకూడదు. సాధ్యాసాధ్యాలు చూసుకుని, దేవుడిపై విశ్వాసంతో ముందుకు సాగాలి. లేనిపోని ఆశలనేవి అనర్థాలకు దారితీస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గించుకుని, ప్రశాంతత అలవరచుకోవాలి.. ఇవి బైబిల్‌లో లిఖితమైన మాటలు.

సీనాయి పర్వత ప్రాంత అడవుల్లో ఇజ్రాయెల్‌ ప్రజలకు మనుగడ కష్టమైంది. వారెంతగానో భయపడిపోయారు. ఇక ముందుకు సాగలేమని నిరుత్సాహం చెందారు. ఆ సమయంలో ‘నీ ముందు నడుస్తున్నవాడు యెహోవా. ఆయన నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టడు. సదా నీకు తోడై ఉంటాడు’ అంటూ ధైర్య వచనాలు వినిపించాయి. ‘యెహోవా దేవునిపై మనకు నమ్మకం ఉంటే.. ఆయనే మనల్ని చేయిపట్టి నడిపిస్తాడని ప్రబోధించాడు యెషయా ప్రవక్త. భయం కలిగినప్పుడు ఆయన్ను స్మరిస్తే అభయమిస్తాడు. ధైర్యాన్నిచ్చి, వెలుగులోకి నడిపిస్తాడు. మనసూ, తనువూ క్షీణించినా.. నా చుట్టూ కోటలా ఉన్నారాయన’ అంటాడు దావీదు మహారాజు. ‘ఈరోజు ఎదుర్కోవాల్సిన సమస్యలు మన ఎదుట ఉండనే ఉన్నాయి. ఇక రేపటి గురించి చింత ఎందుకు? మానసిక ప్రశాంతతను పొందండి’ అన్నాడు ప్రభువు. అంతేకాదు.. తన శాంతిని (మత్త 6:34) మనకు అనుగ్రహించాడు ప్రభువు. కనుక సాధ్యంకాని ఆశలను పెంచుకోవడం, అనవసర విషయాల్లో తలదూర్చడం, అశాంతిపాలవడం ఎందుకు? దేవునిపై బతుకు భారం మోపి, విశ్వాసంతో పయనించాలి.

డా.ఆర్వీ దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు