అచ్యుతః

విష్ణుసహస్రనామావళిలో 100వది. ‘చ్యుతః’ అనే సంస్కృత పదానికి పడిపోయిన, జారిపోయిన అనే అర్థాలున్నాయి. ‘అచ్యుతః’ అంటే ఎన్నడూ పడిపోనివాడు అని సందర్భానుసార అర్థం.

Published : 30 May 2024 00:06 IST

వందే విష్ణుం! 

విష్ణుసహస్రనామావళిలో 100వది. ‘చ్యుతః’ అనే సంస్కృత పదానికి పడిపోయిన, జారిపోయిన అనే అర్థాలున్నాయి. ‘అచ్యుతః’ అంటే ఎన్నడూ పడిపోనివాడు అని సందర్భానుసార అర్థం. ఎక్కడ పడిపోనివాడని ప్రశ్నించుకుంటే- సంసారంలో అని సమాధానం వస్తుంది. అంటే సంసార బంధాలకు చిక్కకుండా ఉండగల శక్తిసంపన్నుడు ఆ స్వామి అని గ్రహించాలి. ‘నేను ఎన్నడూ కూడా నా అసలైన స్వభావం నుంచి జారిపోలేదు; అందువల్ల నేను అచ్యుతుడిని’ అని భాగవతంలో స్వామి స్వయంగా చెప్పిన సందర్భాన్ని  ఇక్కడ గుర్తుచేసుకోవాలి.

వై.తన్వి 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని