అమ్మానాన్నల్ని కాపాడుకోవాలి!

పెద్దవాళ్లు ఔదార్యం చూపాలి, చిన్నవాళ్లు వినయవిధేయతలతో మెలగాలి- అంటూ ప్రబోధించేవారు ముహమ్మద్‌ ప్రవక్త.

Published : 04 Jul 2024 00:11 IST

పెద్దవాళ్లు ఔదార్యం చూపాలి, చిన్నవాళ్లు వినయవిధేయతలతో మెలగాలి- అంటూ ప్రబోధించేవారు ముహమ్మద్‌ ప్రవక్త. పెద్దలను ఆదరించాలని హితపు చెబుతూ ‘ఏ యువకుడైతే వృద్ధుల పట్ల గౌరవభావం చూపిస్తూ హృదయపూర్వకంగా ఆదరిస్తాడో.. అతడు ముసలివాడయ్యాక ఇతరుల నుంచి అలాంటి ప్రేమ, దయ పొందుతాడు. అంటే అతన్ని ఆదరించేవారిని అల్లాహ్‌ నియమిస్తాడు. వారు అతని పట్ల విధేయత ప్రదర్శిస్తారు, సత్ప్రవర్తనతో నడచుకుంటారు. వృద్ధులను సాదరంగా చూడటంలో అల్లాహ్‌ను గౌరవించడం అనేది ఇమిడి ఉంది. పిల్లలపై దయ, పెద్దల పట్ల మన్నన లేని వ్యక్తికి విలువ లేదు. వయసు పైబడిన అమ్మానాన్నలను మాటమాత్రంగా కూడా విసుక్కోకండి. గౌరవప్రదంగా మెలగండి. దయార్ద్రహృదయంతో, వినయంతో వారి ముందు తలవంచి ఉండండి. వారిపట్ల ఆదరణ చూపుతూ ‘ప్రభూ! వీరు నన్ను చిన్నతనంలో ఎలా దయతో, వాత్సల్యంతో పెంచారో.. అలా నువ్వు వీరిని కరుణించు’ అని ప్రార్థించండి’ అంటూ ప్రబోధించారు ప్రవక్త. ‘వృద్ధాప్యం అంటే మరో బాల్యం. ముసలివారు పిల్లలతో సమానం. పెద్ద వయసులో అమ్మానాన్నల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి’ అన్నది ఖురాన్‌ ఉద్బోధ.

ఖైరున్నీసాబేగం 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు