ప్రేమ.. త్యాగం.. సేవ..

తన ప్రసంగాలు, ప్రవర్తనా విధానం, చేసిన మహత్కార్యాల ద్వారా ఏసు ఈ లోకానికి అనంత సందేశాలు అందించాడు.

Published : 04 Jul 2024 00:12 IST

తన ప్రసంగాలు, ప్రవర్తనా విధానం, చేసిన మహత్కార్యాల ద్వారా ఏసు ఈ లోకానికి అనంత సందేశాలు అందించాడు. ‘నేనే సత్యం, నేనే వెలుగు, నేనే మార్గం’ అని ప్రబోధించాడు. అలసి సొలసిన హృదయాలకు గొప్ప శాంతిని, ఊరటను కలిగించాడు. మూఢాచారాలకు దూరంగా ఉండమంటూ మేల్కొలిపిన చైతన్య వాణి ప్రభువుది. చీకటి చిక్కుముడులు విడదీసి, తేటతెల్లంగా కనిపించే చల్లటి వెన్నెల బాటను చూపిన వాణి అది. లోకంలో ప్రతిదీ నశిస్తుంది కానీ, ఎప్పటికీ నిలిచే సత్యవాక్కు అది. ఏసుప్రభువు ప్రబోధించిన ఆ వాక్కే సకల సృష్టికీ కారణభూతమైందని ఆదికాండం 1, 2 అధ్యాయాల్లో బైబిల్‌ పేర్కొంది. ఆ వాక్కే శరీరధారిగా క్రీస్తు రూపాన మన మధ్య నిలిచి చీకట్లను తరిమికొడుతోందని బైబిల్‌ (యోహాను 1:3) ప్రకటించింది. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రేమించమని, ఆ ప్రేమలో త్యాగ, సేవాగుణాలు దాగి ఉండాలనీ ఉద్బోధించాడు ప్రభువు. అలా ఏసు వాక్కు సత్యవంతమై అందరిలోనూ, అంతటా సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఆయన చెప్పిన మాట ఆదర్శం, నడిచిన బాట అనుసరణీయం.

డా.ఆర్వీ దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు