అంతా అన్నంలోనే ఉంది!

అంపశయ్యపై ఉన్న భీష్ముడు పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది ఒక్కసారిగా నవ్వింది.

Published : 11 Jul 2024 00:26 IST

అంపశయ్యపై ఉన్న భీష్ముడు పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు. అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది ఒక్కసారిగా నవ్వింది. ‘అమ్మా! నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్లకీ తెలియాలి’ అన్నాడు భీష్ముడు. ద్రౌపది బదులిస్తూ ‘ఆచార్యా! మీ పలుకులు బాగున్నాయి. కానీ, నాడు నా వస్త్రాపహరణ సమయంలో మీ ఈ ధర్మపరిజ్ఞానం ఏమైపోయింది అనిపించగానే నవ్వు ఆగలేదు’ అంది. అందుకు భీష్ముడు... ‘అమ్మా! నా సమాధానం విను! అప్పుడు నేను సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను. అది నా రక్తంలో కలిసి నా విజ్ఞతను, వివేకాన్ని తెరలా కప్పేయడం వల్ల కర్తవ్యం గుర్తురాలేదు. నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను. పీడన సొమ్ముతో తిన్న అన్నం చెడు ఆలోచనలు కలిగిస్తుంది. ఆహారం స్వార్జితం, దైవార్పితం, మితం అయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది. ధర్మమార్గంలో నడిపిస్తుంది’ అని వివరించడంతో పాంచాలి హృదయ పూర్వకంగా నమస్కరించింది.

డా.జయదేవ్‌ చల్లా 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని