ప్రేమతో గెలువు!

ఒకసారి క్రీస్తు శిష్యుడైన పేతురు ‘ప్రభూ! నా సోదరుడు నా పట్ల అపరాధం చేస్తే అతణ్ని ఎన్నిసార్లు క్షమించాలి? ఏడుసార్లా’ అని అడిగాడు.

Published : 11 Jul 2024 00:27 IST

ఒకసారి క్రీస్తు శిష్యుడైన పేతురు ‘ప్రభూ! నా సోదరుడు నా పట్ల అపరాధం చేస్తే అతణ్ని ఎన్నిసార్లు క్షమించాలి? ఏడుసార్లా’ అని అడిగాడు. అందుకు క్రీస్తు ‘కాదు, డెబ్భై సార్లు’ అని సమాధానం ఇచ్చారు. దీనర్థం సహనం వహించి, క్షమించే గుణం అలవరచుకుంటే మన శత్రువు కూడా మిత్రుడవుతాడు. ‘పగతో పోరాడటం కన్నా, ప్రేమతో గెలవడం మిన్న’ అనేది ప్రభువు చెప్పిన సూక్తి. ఈ సందర్భంలో క్రీస్తు ప్రభువు చెప్పిన మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసుకోవచ్చు. ‘ప్రార్థనా మందిరంలో ఉన్నప్పుడు నీ సోదరుడితో నీకున్న వైరం గుర్తుకొస్తే, క్షణంసేపు నీ ప్రార్థన ఆపి అతడిలోని మంచి గుణాలను గుర్తుచేసుకో. అది నువ్వు చేసే ప్రార్థన కన్నా మహోన్నతమైంది. శత్రువుని ప్రేమించడం, శపించేవారిని దీవించడం, ద్వేషించేవారికి సాయం చేయడం... ఇలా ఉంటే మన కళ్లముందే పరలోకం ప్రత్యక్షమౌతుంది. కోపం, క్రోధం, ద్వేషం లేని ఆ స్వర్గం సహనశీలతకు లభించే అపురూపమైన బహుమానం.

శ్రీవంశీ మట్టా  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని