సౌమ్యనాథుడి బ్రహ్మోత్సవం

అన్నమయ్య జిల్లా నందలూరులో బాహుదా నదీ తీరాన విరాజిల్లుతున్న సౌమ్యనాథ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది.

Published : 11 Jul 2024 00:26 IST

అన్నమయ్య జిల్లా నందలూరులో బాహుదా నదీ తీరాన విరాజిల్లుతున్న సౌమ్యనాథ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. గర్భాలయంలో ఏడడుగుల ఎత్తు ఉండే స్వామి విగ్రహాన్ని నూట యాభై అడుగుల దూరం నుంచి చూస్తున్నా కళ్లముందే సాక్షాత్కారమైనట్లు ఉంటుంది. అన్నమయ్య కొంతకాలం ఇక్కడే ఉండి పలు సంకీర్తనలు రచించినట్లు చెబుతారు. 11వ శతాబ్దంలో చోళ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు గాలి గోపురం కట్టించాడు. 17వ శతాబ్దంలో పాండ్య రాజులు ఆలయాన్ని పునర్నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి గర్భగుడి చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణ చేసి మొక్కుకుంటే అభీష్టాలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. సంతానం లేని వారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే సంతాన సౌమ్యనాథుడనే పేరొచ్చింది. ఈ నెల 14 నుంచి ఈ ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 14న ధ్వజారోహణం, 20న కల్యాణం, 21న రథోత్సవం ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. 22న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. కడప నుంచి 45 కిలోమీటర్ల దూరంలో నందలూరు ఉంటుంది.

బోగెం శ్రీనివాసులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని