మనిషి ఎవరు?

‘నేను’ ఎవరు అనే ఆత్మశోధనే జీవ లక్షణం అంటారు. అయిదు దేహాలతో ఉన్న ఆత్మే మనిషి అని తైత్తరీయోపనిషత్తు వివరించింది....

Published : 30 Apr 2020 00:06 IST

‘నేను’ ఎవరు అనే ఆత్మశోధనే జీవ లక్షణం అంటారు. అయిదు దేహాలతో ఉన్న ఆత్మే మనిషి అని తైత్తరీయోపనిషత్తు వివరించింది. వీటిని అయిదు కోశాలని అభివర్ణించింది. ఆత్మను ఆధారంగా చేసుకుని ఈ పంచకోశాలు విధులు నిర్వర్తిస్తున్నాయని అభివర్ణించింది. అవి

అన్నాద్‌ పురుష - ఆహారంతో రూపుదిద్దుకున్న దేహం ... దీన్నే అన్నమయ కోశం అని అంటారు.

ప్రాణాద్‌ పురుష -ఊపిరి, ప్రాణంతో ఏర్పడ్డ దేహం.. ప్రాణమయకోశమని పిలుస్తారు.

మనోమయాద్‌ పురుష - మనస్సుతో ఏర్పడ్డ శరీరం.. దీన్ని మనోమయకోశమంటారు

విజ్ఞానమయాద్‌ పురుష - మేధస్సుతో కూడిన శరీరమే ఈ విజ్ఞానమయ కోశం.

ఆనందమయాద్‌ పురుష - దైవికమైన ఆనందంతో రూపొందిన దేహమిది. దీన్ని ఆనందమయకోశమని పిలుస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని