షాదీ ముబారక్!
పూర్వం ముబారక్ అనే యువకుడు ఒక గొప్ప ధనవంతుడి దగ్గర తోట మాలిగా పనిచేసేవాడు. అతని తెలివితేటలు, నిజాయితీకి యజమాని ఎంతో మెచ్చుకునేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు తోట యజమాని
ఇస్లాం సందేశం
పూర్వం ముబారక్ అనే యువకుడు ఒక గొప్ప ధనవంతుడి దగ్గర తోట మాలిగా పనిచేసేవాడు. అతని తెలివితేటలు, నిజాయితీకి యజమాని ఎంతో మెచ్చుకునేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజు తోట యజమాని ముబారక్ ను పిలిచి ‘‘నువ్వు రేపటి నుంచి ఈ తోట కాపలా పని వేరొకరికి అప్పగించేయి. ఇకనుంచి నావెంట ఉండాలి.’ అని చెప్పాడు. దీంతో ముబారక్ యజమాని వ్యక్తిగత కార్యదర్శిగా మారిపోయాడు. యజమాని తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ముబారక్ సలహాలుండేవి. చివరకు ఇంటి వ్యవహారాల్లోనూ ముబారక్‌తో సలహా సంప్రదింపులు జరిపేవాడు. ఒకరోజు యజమాని ఏదో దీనంగా ఆలోచిస్తూ నిరాశగా కూర్చుండిపోయాడు.
గమనించిన ముబారక్ ‘అయ్యా ఎందుకంత దిగులుగా ఉన్నార’ని అడిగాడు.
‘అవును ఒక చిక్కు వచ్చి పడింది. అమ్మాయి పెళ్లీడుకొచ్చింది. అమ్మాయి అందం, నా ఆస్తిని చూసి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. త్వరగా ఒక అయ్య చేతిలో పెట్టాలని చూస్తున్నాను. అయితే ఏ సంబంధం ఖాయం చేయాలో, మా అమ్మాయికి తగిన వరుణ్ణి ఎంపిక చేయడమెలాగో నాకు అస్సలు పాలుపోవడం లేదు.’ అని వివరించాడు యజమాని.
‘ఇది పెద్ద సమస్యేమీ కాదండి. పూర్వం అరబ్బులు పెళ్లి చేయాలంటే గొప్ప వంశం, డబ్బు, హోదా, అందం అర్హతలుగా భావించేవారు. వాటిని చూసే తమ పిల్లల పెళ్లిళ్లు చేసేవారు. కానీ పెళ్లికి ధర్మనిష్టే ప్రాతిపదికత అన్నది ఇస్లామ్ స్ఫూర్తి కాబట్టి వచ్చిన సంబంధాలలో ధర్మపరుడైన యువకుడిని ఎంపిక చేసుకోండి’ అని సలహా ఇచ్చాడు.ఇది ఎంతగానో నచ్చింది యజమానికి. ఇంటికెళ్లి జరిగిన వృత్తాంతాన్ని భార్యకు వినిపించాడు. ముబారక్ చెప్పిన సలహా ఆమెకూ నచ్చింది.
తరువాత తన మదిలో మెదిలిన ఆలోచనను యజమాని తన భార్యముందు ఇలా పెట్టాడు. ‘‘మన అమ్మాయికి ముబారక్ అన్ని విధాలా అర్హుడు. ఇంతమంచి గుణవంతుడు ఈ వచ్చిన సంబంధాలలో ఏ ఒక్కడూ లేడు.’ అని తన మనసులో మాట భార్యముందు పెట్టాడు.
’ఒక నౌకరుకు మనమ్మాయినిచ్చి పెళ్లిచేస్తారా’ అని ఆమె భర్తపై కోప్పడింది. ససేమిరా ఒప్పుకోలేదు. కానీ యజమాని మాత్రం ఆమెను ఎలాగోలా ఒప్పించాడు. తన కూతురి వివాహాన్ని నౌకరు ముబారక్ తో జరిపించారు ఆ ఆదర్శ దంపతులు. ఆ నూతన జంటద్వారా కలిగిన సంతానమే అబ్దుల్లాహ్ బిన్ ముబారక్. ఆయన చరిత్రలో గొప్ప విద్వాంసులుగా పేరుప్రఖ్యాతులు సాధించారు. గొప్ప సంకల్పంతో నాటిన విత్తనం గొప్ప ఫలాలను ఇస్తుంది. ‘‘అన్నికాహ్ మిన్ సున్నతి’ అంటే పెళ్లి చేసుకోవడం ప్రవక్త సంప్రదాయం అని అర్థం. తమ పిల్లల పెళ్లిచేయాలంటే చాలామంది అందం, ఐశ్వర్యం, వంశం చూస్తారు. కానీ ఇవేవీ పెళ్లికి ప్రాతిపదిక కాదని, ధార్మిక గుణగణాల ప్రాతిపదికన వివాహ సంబంధాల ఎంపిక చేయాలన్నది ప్రవక్త బోధనల స్ఫూర్తి.
- ఖైరున్సీసాబేగం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం
-
Flipkart: ‘బిగ్ బిలియన్ డేస్’ యాడ్.. ఫ్లిప్‌కార్ట్, అమితాబ్‌పై కాయిట్ ఫిర్యాదు
-
Bandi Sanjay: ప్రధాని మోదీ వాస్తవాలు చెబితే ఉలుకెందుకు?: బండి సంజయ్
-
Hyderabad: ప్రియుడి మరణం తట్టుకోలేక ప్రేయసి బలవన్మరణం
-
Newsclick: న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టు