మాఘ పున్నమి వేళలో... 

న సమం భవితా కించిత్తేజః సౌరేణ తేజసా। తద్వత్‌ స్నానేన మాఘస్య నా సమాః క్రతుజాః క్రియాః।।  సూర్యుని తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరొకటి లేనట్టే, మాఘ స్నానానికి సాటి వచ్చే క్రతువు గాని, క్రియ గాని మరొకటి లేదు

Updated : 25 Feb 2021 06:33 IST

న సమం భవితా కించిత్తేజః సౌరేణ తేజసా। తద్వత్‌ స్నానేన మాఘస్య నా సమాః క్రతుజాః క్రియాః।।  సూర్యుని తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరొకటి లేనట్టే, మాఘ స్నానానికి సాటి వచ్చే క్రతువు గాని, క్రియ గాని మరొకటి లేదు అని దీని భావం. ఈ నెల 27 మాఘ పౌర్ణమి సందర్భంగా...
మాఘ పౌర్ణమినే మహామాఘి అని కూడా అంటారు. ఏడాదిలో వచ్చే అన్ని పౌర్ణమిల్లో ఇది చాలా విశిష్టమైనది. మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారని పురాణ కథనం. అందువల్ల మాఘమాసంలో స్నానానికి ప్రాధాన్యత ఉంటుంది. మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షు లభిస్తాయి. వీటితో పాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మ పురాణంలో పేర్కొన్నారు. సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించడమే.జలాలకు ఈ శక్తి రావడానికి కారణమని చెబుతారు.  ఈ సమయంలో శివకేశవులు ఇద్దరినీ  పూజించాలనీ, దాన ధర్మాలు చేయాలనీ దైవచింతనతో గడపాలని పండితులు చెబుతారు. మాఘ స్నానం ప్రవాహ జలంలో చేస్తే అధిక ఫలితం. స్నానానంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించి దేవాలయంలో దైవ దర్శనం చేసుకోవాలి, దానధర్మాలు చేయాలని నిర్దేశించారు. నదులు సముద్రంలో కలిసేచోట స్నానాలకు వేలాదిగా భక్తులు తరలివెళతారు.

- రమా శ్రీనివాస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు