దప్పిక తీర్చండి!

‘ఓ మనిషీ! నేను దాహంతో తాగడానికి మంచి నీళ్లు అడిగితే నువ్వు ఇవ్వలేదు’‘ఓ అల్లాహ్‌ నువ్వు నన్ను మంచి నీళ్లు అడగడమేమిటి? నువ్వే నా ప్రభువు కదా?’

Published : 18 Mar 2021 00:20 IST

ఇస్లాం సందేశం

‘ఓ మనిషీ! నేను దాహంతో తాగడానికి మంచి నీళ్లు అడిగితే నువ్వు ఇవ్వలేదు’
‘ఓ అల్లాహ్‌ నువ్వు నన్ను మంచి నీళ్లు అడగడమేమిటి? నువ్వే నా ప్రభువు కదా?’
‘ఓ అభాగ్యుడు నిన్ను దాహం తీర్చమని అడిగితే నువ్వు ఇవ్వలేదు. ఆ రోజు నువ్వు అతని దాహం తీరిస్తే నా అనుగ్రహం పొందేవాడివి’
ల్లాహ్‌ ఓ మనిషితో జరిపే సంభాషణ ఇది. దప్పికగొన్న వారికి గుక్కెడు మంచి నీళ్లివ్వడం ఎంత గొప్ప దానమో తెలిపే కథ ప్రవక్త బోధనల గ్రంథంలో ఉంది. సాటి మనిషి దాహం తీర్చడమంటే ప్రభువు దప్పిక తీర్చడమేనని ఇస్లాం చెబుతుంది  ఎంతోమంది శుభ్రమైన మంచినీరు అందక మురికినీరు తాగి మృత్యువాత పడుతున్నారు. ఒక్కరి ప్రాణాలు కాపాడినా మానవాళి అంతటినీ కాపాడినట్లేనని ఖురాన్‌ ఉద్బోధ.  ఒకరి కడవలో బకెటు నీళ్లు తోడి పోయడమూ దానమేనని ప్రవక్త చెప్పారు. మరణించిన తమ పూర్వీకుల పేరిట తాగునీటిని సరఫరా చేసి ఆ పుణ్యాలకు వారిని అర్హులు చేయవచ్చు అంటారాయన.
హజ్రత్‌ సాద్‌ (రజి) అనే సహచరుడి మాతృమూర్తి కన్నుమూశారు. ‘మా అమ్మ పేరిట చేసేందుకు ఏదైనా పుణ్యకార్యం చెప్పండి’ అని అడిగారాయన. దానికి ప్రవక్త (స) ‘ఒక బావిని తవ్వించు’ అని సలహా ఇచ్చారు.  ఏవిధంగా నిప్పును నీరు చల్లారిస్తుందో అదే విధంగా పాపాగ్నిని దానధర్మాలు కడిగేస్తాయి.

- ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని