ఏది అవిద్య ?
మానవుడి అన్ని దుఃఖాలకు కారణం ‘అవిద్య’ అని చెబుతారు తత్వవిదులు. అసలు ‘అవిద్య’ అంటే ఏంటి? దుఃఖానికి అది ఎలా కారణం అవుతుంది? ‘అవిద్య’ను ఆధ్యాత్మిక గురువులు ఎలా నిర్వచించారు?
మానవుడి అన్ని దుఃఖాలకు కారణం ‘అవిద్య’ అని చెబుతారు తత్వవిదులు. అసలు ‘అవిద్య’ అంటే ఏంటి? దుఃఖానికి అది ఎలా కారణం అవుతుంది? ‘అవిద్య’ను ఆధ్యాత్మిక గురువులు ఎలా నిర్వచించారు?
* ‘గురువర్యా! నిద్రలో నేనెంతో ప్రశాంతత, సుఖాన్ని అనుభవిస్తున్నాను. కానీ మెలకువలో అవి మాయమైపోతున్నాయి? అశాంతి, దుఃఖం వచ్చి చేరుతున్నాయి. కారణమేంటి?’ అని ప్రశ్నిస్తాడు శిష్యుడు. దానికి ఆది శంకరాచార్యులు ‘నాయనా! నువ్వు మేల్కొన్నప్పుడు ఇంద్రియాలు కూడా మేల్కొంటున్నాయి. వేటి కోసమో వెంపర్లాడుతున్నాయి. దాన్నే ‘అవిద్య’ అంటారు. నువ్వు అసంసారివి అయినా సంసారిననుకోవటం, దేనికీ కర్తవు కాకపోయినా కర్తను అనుకోవటం, భోక్తవు కాకపోయినా భోక్తననుకోవటం, నువ్వు ఆత్మరూపంగా శాశ్వతుడవైనా శరీరానికే పరిమితమై అశాశ్వతుడనని భ్రమపడటం ‘అవిద్య’. నువ్వు మళ్లీ మళ్లీ పుట్టటానికి, మరణించటానికి ‘అవిద్యే’ కారణమని శంకరులు ఉద్ఘాటిస్తారు.
* ప్రాపంచిక మోహంలో పడేసి, మనిషిని భగవంతుడికి దూరం చేసే గుణాలు కలిగిందే ‘అవిద్య’, అది మహామాయ అంటారు రామకృష్ణ పరమహంస. ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలంటే భక్తి, జ్ఞానం, దయ, ప్రేమ, వైరాగ్యం ‘విద్య’ లక్షణాలైతే, భగవంతుడిపై విశ్వాసం లేకపోవటం, అజ్ఞానం, కాఠిన్యం, ప్రేమరాహిత్యం, భోగాసక్తి ఇవన్నీ ‘అవిద్య’ స్వభావాలు అని వివరిస్తారు. మనిషి తన సహజ స్వభావ ఆనందాన్ని కాదని, సంసార దుఃఖాల్లో కూరుకుపోవటానికి ఈ ‘అవిద్య’ కారణమని విస్పష్టం చేస్తారు పరమహంస.
* తాను తనువు అనుకోవటమే ‘అవిద్య’, ఆత్మ అని తెలుసుకోవటమే ‘విద్య’ అంటారు రమణ మహర్షి. కూలి కోసం బరువులు మోసే వ్యక్తి, వాటిని దింపే స్థలం రాగానే సంతోషంగా బరువు దించుకుంటాడు. తర్వాత ఆ బరువుకేసి చూడడు. జీవన్ముక్తునికి ఈ శరీరం లగేజీ లాంటిది. కూలివాడికి తాను మోసే బరువుపై ‘నేను, నాది’ అనే భావం ఉండనట్టే, జీవన్ముక్తుè¨కీ దేహంపై అభిమానం, మమకారం ఉండవు. మానవ శరీరంతో జన్మ ఎత్తినందుకు ఆత్మజ్ఞానం పొందాలి. పొందాక శరీరభావాన్ని విడవాలి. భోజనం అయ్యాక ఎంగిలి ఆకును అవతల పారేసినట్లు శరీరభావాన్ని తోసివేయాలిగానీ, ఇంకా దాన్నే పట్టుకొని వెళ్లటమేంటి? అదే ‘అవిద్య’ అంటారు రమణులు.
* ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమించే మాయే ‘అవిద్య’ అన్నారు అద్వైతులు. తత్త్వజ్ఞానం లేకపోవటమే ‘అవిద్య’ అని వ్యాఖ్యానించారు విశిష్టాద్వైతులు. ‘క్షణికమైన వాటిని శాశ్వతమని తలచటమే అవిద్య’ అంటారు బౌద్ధ గురువులు. అనిత్యం, అశుచి, దుఃఖం, అనాత్మలను... నిత్యం, శుచి, సుఖం, ఆత్మ అనుకోవటం ‘అవిద్య’ అని పతంజలి యోగసూత్రాలు పేర్కొంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే చీకట్లో తాడును చూసి పాము అనుకొని భయపడ్డట్టు అశాశ్వతమైన ప్రపంచాన్ని, శాశ్వతమని భ్రమించటమే ‘అవిద్య’.
- బి.సైదులు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/09/2023)
-
Air India: వేడి నీళ్లు పడి విమాన ప్రయాణికురాలికి గాయాలు.. క్షమాపణలు కోరిన ఎయిర్ఇండియా!
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ