అర్ధనారీశ్వరుడు ఎందుకయ్యాడు?

భక్తులు ఆదిదంపతులైన శివపార్వతులను ప్రార్థించడం సాధారణం. కానీ ఒక సందర్భంలో భృంగి అనే గణనాథుడు పార్వతీదేవిని పట్టించుకోక కేవలం శంకరుణ్ణే ప్రార్థించాడు. శివుడు అతణ్ని కరుణించాడు. దాంతో పార్వతికి కోపం...

Updated : 04 Nov 2021 06:37 IST

క్తులు ఆదిదంపతులైన శివపార్వతులను ప్రార్థించడం సాధారణం. కానీ ఒక సందర్భంలో భృంగి అనే గణనాథుడు పార్వతీదేవిని పట్టించుకోక కేవలం శంకరుణ్ణే ప్రార్థించాడు. శివుడు అతణ్ని కరుణించాడు. దాంతో పార్వతికి కోపం వచ్చింది. భక్తుల పట్ల ఉన్న శ్రద్ధ తనపై లేదని అలిగింది. ఆమె కేదారక్షేత్రంలో గౌతమ ముని వద్ద ఉపదేశం పొంది కేదారేశ్వరుని స్మరిస్తూ తపస్సు చేసింది. అప్పుడు శివుడు సాక్షాత్కరించి తన అర్ధభాగాన్ని పార్వతికిచ్చాడు. అలా అర్ధనారీశ్వరుడయ్యాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని