బలం ఎందుకు ?

ఒకరోజు సాయిబాబా చెట్ల మధ్య తిరుగుతుండగా అక్కడే మేత మేస్తున్న ఒక ఆవు కాలు వేయడంతో ఓ చిన్న మామిడి మొక్క పక్కకు వాలిపోయింది.

Published : 09 Dec 2021 00:38 IST

ఒకరోజు సాయిబాబా చెట్ల మధ్య తిరుగుతుండగా అక్కడే మేత మేస్తున్న ఒక ఆవు కాలు వేయడంతో ఓ చిన్న మామిడి మొక్క పక్కకు వాలిపోయింది.

సకల ప్రాణుల భాష తెలిసిన సాయి ఆ మొక్కను సరిచేస్తూ ‘ఈ ప్రపంచానికి నీ గురించి తెలియాలంటే ముందు బలంగా నేలలో నాటుకోవాలి. స్థిరంగా, దృఢంగా నిలబడాలి. అప్పుడే నువ్వు భవిష్యత్తులో ఎందరికో నీడను, ఫలాలను ఇవ్వగలుగుతావు’ అన్నాడు.

సాయి ఆ మామిడి మొక్కతో చెప్పిన మాటలు మనకు కూడా వర్తిస్తాయి. శారీరకంగా బలంగా ఉండి ఆరోగ్యాన్ని సంతరించుకుంటేనే మన ఆలోచనలూ మెరుగ్గా ఉండి పక్క దోవ పట్టించవు. బలమైన దేహంలో దృఢమైన బుద్ధి ఉన్నప్పుడు తమ కాళ్ల మీద తాము నిలబడటమే కాక మరో పదిమందికి సాయపడగలరు. సహాయం ఆర్థిక పరమైందే కానవసరం లేదు. మాటలతో మార్గదర్శనం చేయడం, స్ఫూర్తికరమైన ఆలోచనలు కలిగించడం.. ఏదైనా కావచ్చు. సాయి జ్ఞానబోధలు లోతుగా, భావగర్భంగా ఉంటాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ.

- డాక్టర్‌ జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని