అరవై రెట్లు అవుతుంది

ఒకసారి మగధలో అంటువ్యాధి ప్రబలి చాలామంది చనిపోయారు. ఓ కోటీశ్వరుడు కూడా మంచానపడ్డాడు. ఆయన తన పన్నెండేళ్ల కొడుకు అశోకుని పిలిచి ‘నాయనా! నేనూ, అమ్మా ఇక బతకమనిపిస్తోంది. నీ

Published : 09 Dec 2021 00:38 IST

ఒకసారి మగధలో అంటువ్యాధి ప్రబలి చాలామంది చనిపోయారు. ఓ కోటీశ్వరుడు కూడా మంచానపడ్డాడు. ఆయన తన పన్నెండేళ్ల కొడుకు అశోకుని పిలిచి ‘నాయనా! నేనూ, అమ్మా ఇక బతకమనిపిస్తోంది. నీ కోసం నలబై కోట్ల వరహాలు దాచాను’ అంటూ వివరాలు చెప్పి సమయం వచ్చినపుడు సొంతం చేసుకోమన్నాడు. కొడుకును వెంటనే దూరప్రాంతానికి వెళ్లి స్థిరపడమన్నాడు. అశోకుడలాగే వెళ్లి పుష్కరం తర్వాత తండ్రి చెప్పిన సొమ్ము కోసం నగరానికి వచ్చాడు. కానీ వెంటనే సొమ్ము తీసుకుంటే రాజుకి అనుమానం వస్తుందనే భయంతో విడతల వారీగా తీసుకుందామనుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా దండోరా విభాగంలో చేరాడు. ఒకసారి దండోరా వేస్తున్న అతడి కంఠస్వరం విన్న రాజు ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న స్పష్టత, గాంభీర్యాలతో అనుమానం వచ్చి అతడిపై నిఘా ఉంచాడు. అసలు సంగతి తెలుసుకున్న రాజు అశోకుడి ధనాన్ని కోశాగారానికి తరలించి, తన కుమార్తెతో పెళ్లి జరిపించాడు. కొత్త దంపతులను బుద్ధుని ఆశ్రమానికి తీసికెళ్లి అల్లుడి గురించి చెప్పాడు. దానికి బుద్ధుడు ‘ప్రయత్నం, తెలివి, జ్ఞాపకశక్తి, అప్రమత్తత, ధర్మబద్ధత, ఇంద్రియవశం అనే ఆరు లక్షణాలుంటే సంపద అరవై రెట్లు అవుతుంది. దీనికి నీ అల్లుడు అశోకుడే ఉదాహరణ. ధనికుడు మాత్రమే కావలసినవాడు రాజుకు అల్లుడయ్యాడు. రాజ్యానికి అధిపతి అయ్యాడు’ అన్నాడు.

- లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని