తీర్థానికీ క్షేత్రానికీ తేడా

సర్వసామాన్యంగా మనం తీర్థక్షేత్రం అనే పదాన్ని వాడుతుంటాం. వాస్తవానికి తీర్థం, క్షేత్రం రెండూ వేర్వేరు. నదీనదాలు, సముద్ర తీరాన వెలసిన ఆలయాలను తీర్థాలంటారు. పవిత్ర గంగ, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి

Updated : 20 Jan 2022 06:16 IST

సర్వసామాన్యంగా మనం తీర్థక్షేత్రం అనే పదాన్ని వాడుతుంటాం. వాస్తవానికి తీర్థం, క్షేత్రం రెండూ వేర్వేరు. నదీనదాలు, సముద్ర తీరాన వెలసిన ఆలయాలను తీర్థాలంటారు. పవిత్ర గంగ, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదుల తీరంలో ఉన్న వారణాసి, గోకర్ణం, రామేశ్వరం వంటివి తీర్థాలు. నదీజలాలు లేని ప్రాంతాల్లో కొలువైన ఆలయాలు క్షేత్రాలు. ఇవి స్థలక్షేత్రాలు, గిరి క్షేత్రాలు అని రెండు రకాలున్నాయి. నేలపై ఉన్న ఆలయాలు స్థల క్షేత్రాలు కాగా కొండలపై వెలసినవి గిరి క్షేత్రాలు. తిరుమల, మంగళగిరి, సింహాచలం, శ్రీశైలం, యాదగిరిగుట్ట వంటివి గిరిక్షేత్రాలు. అహోబిలం నరసింహ స్వామి ఆలయం, ఆలంపూరు జోగులాంబ దేవాలయం మొదలైనవి స్థల క్షేత్రాలు. పక్కన నది ఉన్నప్పటికీ కొండపై వెలసిన విజయవాడ కనకదుర్గ తదితర ఆలయాలను కూడా క్షేత్రాలుగానే పరిగణిస్తారు.

- లక్ష్మి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని