దేవుడు ఎక్కడున్నాడు?
యవ్వనప్రాయంలో వివేకానంద జ్వలించే అగ్నికణంలా ఆవేశంగా ఉండేవారు. ఎప్పుడూ తార్కికంగా ఆలోచించేవారు. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం వస్తేగానీ సంతృప్తి చెందేవారు కాదు. ఒకసారి ఆయన రామకృష్ణ పరమహంసను దర్శించుకుని..
యవ్వనప్రాయంలో వివేకానంద జ్వలించే అగ్నికణంలా ఆవేశంగా ఉండేవారు. ఎప్పుడూ తార్కికంగా ఆలోచించేవారు. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం వస్తేగానీ సంతృప్తి చెందేవారు కాదు. ఒకసారి ఆయన రామకృష్ణ పరమహంసను దర్శించుకుని.. ‘మీరెప్పుడూ దేవుడి గురించే మాట్లాడతారు కదా! ఆయన ఉన్నాడనడానికి నిదర్శనం చూపించగలరా?’ అనడిగారు. పరమహంస నవ్వి ‘దేవుడు ఉన్నాడనడానికి నేనే నిదర్శనం’ అన్నారు. దాంతో నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు వివేకానంద.
మూడు రోజుల తర్వాత వివేకానంద మళ్లీ వచ్చి.. ‘నాకు దేవుడిని చూపించగలరా?’ అనడిగారు. ‘నీకు ధైర్యం ఉంటే చూపిస్తాను’ అన్నారు పరమహంస. తాను సిద్ధమేనన్నారు వివేకానంద. వెంటనే పరమహంస తన పాదాన్ని వివేకానందుడి ఛాతీపైన ఆనించారు. అప్పుడు వివేకానంద ఒకలాంటి తన్మయత్వానికి గురై సమాధి స్థితిలోకి వెళ్లి ఆశ్చర్యంగా పన్నెండు గంటలపాటు అలాగే ఉండిపోయారు. అప్పటినుంచీ శాంత స్వభావుడిగా మారిపోవడమే కాదు, మరెన్నడూ దేవుడి ఉనికిని గురించి ప్రశ్నించలేదు. ఈ అనుభవాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు వివేకానంద.
- అభిజిత్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!
-
Karnataka Bandh: ‘కావేరీ’ పోరు: స్తంభించిన కర్ణాటక.. 44 విమానాలు రద్దు
-
Salaar release date: ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన టీమ్
-
CPI Ramakrishna: జగన్, అదానీల రహస్య భేటీ వెనుక మర్మమేంటి?: సీపీఐ రామకృష్ణ
-
Hyderabad: కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనం.. హుస్సేన్‌సాగర్ వద్ద బారులుతీరిన విగ్రహాలు
-
LIC పాలసీ పునరుద్ధరణ.. నచ్చిన కార్డ్ ఎంపిక.. అక్టోబర్‌లో మార్పులు ఇవే..!