రామబాణం అంటే?

సాధారణంగా ‘రామబాణం’ అంటే గురి తప్పనిది అని మనమంతా అనుకుంటాం. కానీ దీని వెనుక దాగిన నిజమైన కథ వేరు. లక్ష్మణుడు అన్ని దివ్యాస్త్రాలూ ప్రయోగించినప్పటికీ ఇంద్రజిత్తు మరణించడం లేదు. దాంతో లక్ష్మణుడు ‘ధర్మాత్మా సత్య సంధశ్చ

Updated : 27 Jan 2022 05:09 IST

సాధారణంగా ‘రామబాణం’ అంటే గురి తప్పనిది అని మనమంతా అనుకుంటాం. కానీ దీని వెనుక దాగిన నిజమైన కథ వేరు. లక్ష్మణుడు అన్ని దివ్యాస్త్రాలూ ప్రయోగించినప్పటికీ ఇంద్రజిత్తు మరణించడం లేదు. దాంతో లక్ష్మణుడు ‘ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాప్రతిద్వందహా తదైనం జహి రావణిమ్‌’ అంటూ ఒక బాణాన్ని సంధించగానే ఇంద్రజిత్తు తల తెగిపోయింది. లక్ష్మణుడు చదివిన ఆ శ్లోకానికి ‘నా సోదరుడు రాముడు ధర్మాత్ముడు, నిజాలు మాట్లాడేవాడు, పౌరుషవంతుడు, దశరథుని కొడుకే గనుక అయితే ఈ బాణం ఇంద్రజిత్తును సంహరించు గాక!’ అని అర్థం. అంటే రాముని మీద ఒట్టుపెట్టుకుని ప్రయోగించే ఈ బాణం రాముడంతటి శక్తిని కలిగి శత్రువును నిర్మూలిస్తుందని భావం. అప్పటి నుంచే రామబాణం అనే పద ప్రయోగం వాడుకలోకి వచ్చింది. జన బాహుళ్యంలో రామబాణం అంటే ఏడు తాటి చెట్లను నరికేసే శక్తి కలది అనే అపోహ ఉంది. కానీ   నిజానికి రామనామానికి ఉన్న శక్తిని చెప్పడానికి వాడే పదమే ఈ రామబాణం.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని