మనసు గతి

ఒకసారి రమణమహర్షి పుష్కరిణికి వెళ్లినపుడు ‘శివుడు ధ్యానం చేస్తున్నట్లుగా నీరెంత నిర్మలంగా ఉందో!’ అన్నారు శిష్యులతో. అంతలో ఒక ఎండు కొమ్మ పడటంతో ‘అయ్యో! శివుని ధ్యానం చెదిరిపోయిందే’ అన్నాడో

Updated : 27 Jan 2022 05:26 IST

కసారి రమణమహర్షి పుష్కరిణికి వెళ్లినపుడు ‘శివుడు ధ్యానం చేస్తున్నట్లుగా నీరెంత నిర్మలంగా ఉందో!’ అన్నారు శిష్యులతో. అంతలో ఒక ఎండు కొమ్మ పడటంతో ‘అయ్యో! శివుని ధ్యానం చెదిరిపోయిందే’ అన్నాడో శిష్యుడు. రమణులు ‘అవును, మన మనసూ ఇంతే! బయటి విషయాలు పట్టించుకోకపోతే నిశ్చలంగా ఉంటుంది. పట్టించుకుంటే ఇలాగే అలజడికి గురవుతుంది. బయటి వాసనలను పట్టించుకోనివారు అంతర్ముఖులై విముక్తి పొందుతారు. లేదంటే జన్మ చక్రంలో పడి తిరుగుతుంటారు. మనసుకు ఇవన్నీ బొమ్మల వంటివి. చూడగానే ఆడుకుంటుంది. అప్రమత్తంగా అలజడులు చెలరేగవు’ అన్నారు.

- లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని