మాఘ మాస ఘనత...

మాఘమాసం గొప్ప అంతా ఇంతా కాదు. లలితా అమ్మవారు మాఘ పౌర్ణమి రోజు పుట్టింది. సూర్యుడు, సరస్వతీదేవి పుట్టింది కూడా ఈ మాసంలోనే. శివుడు లింగ రూపం దాల్చింది మాఘ బహుళ చతుర్దశి నాడు. మా-అఘము అంటే పుణ్యాన్ని

Published : 10 Feb 2022 00:38 IST

మాఘమాసం గొప్ప అంతా ఇంతా కాదు. లలితా అమ్మవారు మాఘ పౌర్ణమి రోజు పుట్టింది. సూర్యుడు, సరస్వతీదేవి పుట్టింది కూడా ఈ మాసంలోనే. శివుడు లింగ రూపం దాల్చింది మాఘ బహుళ చతుర్దశి నాడు. మా-అఘము అంటే పుణ్యాన్ని ఘనంగా ఇచ్చేదని, పాపాలను పోగొట్టేదనీ అర్థం. మాఘ పున్నమి నాడు కొద్దిపాటి పుణ్యకర్మలు చేసినా.. అవి అనంత ఫలితాన్నిస్తాయంటారు. ఈ మాసానికి అధిదేవత కేతువు. చంద్రుడు కేతు నక్షత్రమైన మేఘాల్లో ఉంటాడు కనుక మాఘమాసంగా స్థిరపడిందని ఇంకో కథనం. ఈ నెలలో నువ్వులను దానం చేయడం మంచిది. మాఘ శుద్ధ ఏకాదశి నుంచి మాఘ పున్నమి వరకు ఉన్న అయిదు రోజులను భీష్మ పంచకం అంటారు. ఈ అయిదు రోజులూ జపం, తపం, దానం, సముద్ర స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. వీటిని అంత్య పుష్కరిణి స్నానాలు అంటారు. రోజూ చేసే స్నానం శరీరపు మలినాలను పోగొడితే, అంత్య పుష్కరిణి స్నానం మనసులోని మాలిన్యాలను పోగొడుతుంది.

- లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు