అష్ట భార్యల వెనుక...

రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ- అనే ఎనిమిదిమంది శ్రీకృష్ణుని భార్యలని వినే ఉంటారు. ఎవరికి వారే సౌందర్యరాశులు. వీరి వెనుక దాగిన అసలు అర్థం

Published : 17 Feb 2022 00:32 IST

రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ- అనే ఎనిమిదిమంది శ్రీకృష్ణుని భార్యలని వినే ఉంటారు. ఎవరికి వారే సౌందర్యరాశులు. వీరి వెనుక దాగిన అసలు అర్థం వేరని ప్రబోధిస్తుంది నిరుక్త నిఘంటువు. వీరు అష్ట ప్రకృతులు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలే గాక, మనసు, బుద్ధి, అహంకారం అనేవాటిని కలిపి అష్ట ప్రకృతులు అంటారు. ఇందులో సత్యభామ భూ ప్రకృతి అంటే భూదేవే. పట్టమహిషి రుక్మిణి మనసు. జాంబవతి బుద్ధి. కాళింది నీరు. మిత్రవింద వాయువు. నాగ్నజితి అహంకారం. భద్ర ఆకాశం. లక్షణ అగ్ని. కనుక కృష్ణుడి అష్టభార్యలు ప్రకృతికి ప్రతిరూపాలు. ఈ అష్ట ప్రకృతులు పురుషుడైన శ్రీకృష్ణుడి అధీనంలో ఉంటాయని చెప్పడానికే వ్యాసుడు ఆయనకు అష్ట భార్యలని చెప్పాడు. వీరి సాయంతోనే కృష్ణుడు అనేక మహిమలు చూపాడు.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని