మేఘ పాఠం
బుద్ధుని ప్రబోధాలతో ప్రభావితమైన మేఘుడు అనే శిష్యుడు ఒకరోజు ధ్యానం చేసుకోవడానికి అనుమతి అడిగాడు. ఇప్పుడొద్దు, తర్వాత వెళ్లమంటే వినకుండా బుద్ధుని బలవంతంగా ఒప్పించి ధ్యానం ఆరంభించాడు.
బుద్ధుని ప్రబోధాలతో ప్రభావితమైన మేఘుడు అనే శిష్యుడు ఒకరోజు ధ్యానం చేసుకోవడానికి అనుమతి అడిగాడు. ఇప్పుడొద్దు, తర్వాత వెళ్లమంటే వినకుండా బుద్ధుని బలవంతంగా ఒప్పించి ధ్యానం ఆరంభించాడు. మూడుగంటలసేపు ప్రయత్నించినా అతడికి ధ్యానం మీద మనసు లగ్నం కాలేదు. ఆ సంగతి బాధగా చెప్పాడతను. అది విన్న బుద్ధుడు ‘అక్షరాలు నేర్చు కోకుండా వాక్యాలను, వాక్య నిర్మాణం తెలియకుండా పుస్తకాన్ని చదవడం సాధ్యం కానట్లే ధ్యానంలో కుదురుకోవడానికి కొన్ని నియమాలున్నాయి. నువ్విక్కడ చేరి పదిహేను రోజులైనా కాలేదు. నేను ధ్యానానికి సంబంధించిన ఏ సంగతులూ ఇప్పటివరకూ నీతో చెప్పనేలేదు. పెద్దలు ఆగమన్నప్పుడు.. ఎందుకు చెప్పారోనని ఆలోచించ లేదు. ఒక కొత్త విషయం నేర్చు కోవడానికి ఉత్సుకత చూపావే కానీ అదెలా సాధ్యం, అందులో లోతుపాతులేమిటని తెలుసు కోలేదు. అవగాహన లేకుండా ధ్యానం చేయాలనే నీ ఉత్సాహం ఒడ్డున పడిన చేప స్థితిని తలపిస్తోంది. చాలామంది నీలాగే విషయం పూర్తిగా తెలుసుకోకుండా బరిలోకి దిగుతున్నారు. సరైన విషయ పరిజ్ఞానంతో కొనసాగినపుడే తలపెట్టిన పని సఫలమవుతుంది. ఉన్నతి సాధించాలనుకునే అందరికీ ఈ విషయాలు వర్తిస్తాయి.. దేశాన్ని ఏలే రాజుకైనా సరే! నీ పేరులోని మేఘాన్నే తీసుకుంటే.. అది వర్షించే ముందు ఎంతో నీటి ఆవిరిని తనలో ఇముడ్చుకొని, మరెంతో దూరం ప్రయాణిస్తుంది. ఆ ఓర్పూ నేర్పూ ఉండాలి’ అంటూ చెప్పాడు బుద్ధుడు ఎంతో శాంతంగా. మేఘుని కళ్లు జ్ఞానంతో విప్పారాయి.
- లక్ష్మి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Law Commission: అప్పట్లో.. శృంగార సమ్మతి వయసు ‘పదేళ్లే’!
-
జీతం లేకుండా పనిచేస్తానన్న సీఈఓ.. కారణం ఇదే..!