దేవుణ్ణి నిందిస్తారా?!

దేవుడి గురించి కొన్ని సందేహాలడిగాడో శిష్యుడు. అన్నీ విన్న రమణ మహర్షి ‘జీవితం మనం చెప్పినట్టు సాగదు. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అనేది అన్ని వేళలా, అందరికీ వర్తించేది కాదు. అలా జరగాలంటే మన సంకల్పానికి దైవబలం తోడవ్వాలి. దాన్నే అదృష్టం అంటున్నాం.

Updated : 10 Mar 2022 05:54 IST

దేవుడి గురించి కొన్ని సందేహాలడిగాడో శిష్యుడు. అన్నీ విన్న రమణ మహర్షి ‘జీవితం మనం చెప్పినట్టు సాగదు. దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అనేది అన్ని వేళలా, అందరికీ వర్తించేది కాదు. అలా జరగాలంటే మన సంకల్పానికి దైవబలం తోడవ్వాలి. దాన్నే అదృష్టం అంటున్నాం. దైవం లేదని, అంతా స్వయంకృషే అంటారు కొందరు. అది వేరే సంగతి. ప్రతి కలయిక విడిపోవడానికి నాంది అనేది తొలి సూత్రం. ఇది జయాపజయాలకూ వర్తిస్తుంది. శాశ్వతం అనే పదం దేవుని నిఘంటువులో ఉండదు. ప్రతిదీ మార్పులకు లోను కావలసిందే. కొత్త బంధాలు ఏర్పడతాయి. అలాగే పాత బంధాలు తెగిపోతాయి. ఇలాంటప్పుడు చాలామంది దేవుని స్మరిస్తారు. దైవబలం ఉంటే రాజు పేద కావచ్చు.. పేదవాడు రాజు కావచ్చు. ప్రకృతిని అదుపులోకి తీసుకునేవారిని పంచభూత శక్తుల ద్వారానే దేవుడు శిక్షిస్తుంటాడు. మన జీవితం భోజనం వంటిది దాన్ని ఆస్వాదిస్తూ ఆరగించాలి. అంతేకానీ వెండి కంచంలో భోజనం ఎందుకు పెట్టలేదు తరహాలో దేవుణ్ణి నిందిస్తారు కొందరు. ఆలస్యం అయిన కొద్దీ భోజనం చల్లారిపోయినట్టుగానే అనుభవించాల్సిన జీవితం అనే భోజనం చల్లారి వార్ధక్యం మీద పడుతుంది. కనుక స్వశక్తితోపాటు దైవశక్తి ఉందనే నమ్మకంతో సాగాలి’ అంటూ వివరంగా చెప్పారు.

- జయదేవ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని