సాధువును మార్చేసిన కత్తి
అరణ్యవాసంలో ఆయుధాలు ధరించవద్దంటూ యథార్థంగా జరిగిన ఒక వృత్తాంతాన్ని రాముడికి చెప్పింది సీతమ్మ. ‘పూర్వం సత్యాన్నీ ధర్మాన్నీ అనుసరించే ఒక తపస్వి ఉండేవాడు. ఆయనకు అడవిలో ఉండే మృగాలు, పక్షుల మీద ఎంతో
కథాస్రవంతి
అరణ్యవాసంలో ఆయుధాలు ధరించవద్దంటూ యథార్థంగా జరిగిన ఒక వృత్తాంతాన్ని రాముడికి చెప్పింది సీతమ్మ. ‘పూర్వం సత్యాన్నీ ధర్మాన్నీ అనుసరించే ఒక తపస్వి ఉండేవాడు. ఆయనకు అడవిలో ఉండే మృగాలు, పక్షుల మీద ఎంతో ప్రేమ, దయ. అతడి తపస్సుకి భంగం కలిగించాలనుకున్న ఇంద్రుడు.. భటుడి వేషంలో వచ్చి ఒక కత్తి ఇచ్చి, ‘దీన్ని కొంతకాలం నీదగ్గర ఉంచు, తర్వాత తీసుకువెళ్తాను’ అని వెళ్లిపోయాడు. ముని పరాయిసొమ్ముని జాగ్రత్తగా కాపాడాలనుకున్నాడు. అడవికి వెళ్లినా, కత్తిని తనతోనే ఉంచుకోవడంవల్ల దానిమీద మమకారం కలిగింది. పండ్లు, సమిధలు కోయడానికి కత్తిని ఉపయోగించసాగాడు. అడవి మృగాలు ఎదురైతే, ఇంతకు ముందు తప్పుకు పోయే వాడు. ఇప్పుడు బెదిరిస్తాడు, కత్తిని తిరగేసి కొడతాడు, కొన్నిసార్లు చంపుతున్నాడు. అది కాస్తా వినోదంగా మారింది. అందులో మునిగి, నిత్యకృత్యాలను నిర్లక్ష్యం చేస్తూ అథఃపాతాళానికి పడిపోయాడు. ఇంద్రుడి కోరిక నెరవేరింది. ఇదంతా ఆయుధం చేతిలో ఉండటం వల్ల జరిగింది. అగ్ని తాను ఆశ్రయించిన కట్టెనే దహించినట్లు ఆయుధం తనని ధరించినవాడినే నాశనం చేస్తుంది. వస్తువు కానీ, వ్యక్తి కానీ దగ్గరలో ఉన్నప్పుడు ఆకర్షణ కలగటం సహజం. ‘సంగాత్సంజాయతే కామః’ అన్నారు. ఒక వస్తువు మీద ఇష్టం కలగటానికి అది దగ్గరగా ఉండటం ముఖ్య కారణమని నిరూపిస్తుందీ కథ. కనుక వద్దనుకున్న అంశాలకు దూరంగా ఉండాలనేది మౌలిక సూత్రం.
- డాక్టర్ అనంతలక్ష్మి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games 2022: ఆసియా క్రీడలు.. అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాల వర్షం
-
KTR: మోదీ యాక్టింగ్‌కు ఆస్కార్ ఖాయం: కేటీఆర్
-
Ram Charan: కొత్త ఫ్రెండ్‌ని పరిచయం చేసిన రామ్ చరణ్.. ఎవరంటే?
-
AP HighCourt: బండారు పిటిషన్‌పై విచారణ వాయిదా
-
AP Voter List: ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఉపాధ్యాయులకే అప్పగించండి: సీఎఫ్‌డీ
-
Rolls Royce: యువకుడి నైపుణ్యం.. మారుతి కారుని రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు