అమ్మవారికి కట్టిన చీరలు భక్తులు ధరించవచ్చా?

సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు కట్టిన చీరలను (శేష వస్త్రం) వేలం వేయడం లేదా ధర కట్టి అమ్మడం షరా మామూలే! కానీ కొందరు భక్తులకు అమ్మవారికి కట్టిన చీరలు ధరించవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంటుంది.

Updated : 16 Jun 2022 03:42 IST

సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు కట్టిన చీరలను (శేష వస్త్రం) వేలం వేయడం లేదా ధర కట్టి అమ్మడం షరా మామూలే! కానీ కొందరు భక్తులకు అమ్మవారికి కట్టిన చీరలు ధరించవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంటుంది. అమ్మవారికి కట్టిన చీరలు సాధారణ భక్తులు నిరభ్యంతరంగా ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ వస్త్రాలు ధరించినప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాంటి చీరలను శుక్రవారం నాడు మాత్రమే ధరించాలి. వాటిని ధరించినప్పుడు కోపాలూ అసహనాలూ లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, భగవన్నామ స్మరణ చేయడం మంచిది. రాత్రి సమయాల్లో ధరించకూడదు. ఈ చీరను ఉతికినప్పుడు ఆ నీళ్లను ఎక్కడపడితే అక్కడ పోసి తొక్కకుండా, మొక్కల్లో మాత్రమే పోయాలి. అన్నిటి కంటే ముఖ్యమైన సూత్రం నెలసరి సమయంలో ఆ వస్త్రాల జోలికి వెళ్లకూడదు. ఈ నియమాలు పాటించినప్పుడే అమ్మవారి అనుగ్రహం ధరించినవారి మీద ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.

- ఈవని వెంకట గౌరీ నాగ దీప్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని