ఎలా చూడగలం?

ఒక భక్తుడు ‘మీరు తరచుగా ఆత్మ అనే పదాన్ని వాడుతున్నారు. దాన్నెలా తెలుసుకోవడం?’ అనడిగాడు. దానికి రమణమహర్షి ‘అద్దంలో చూసినప్పుడు నీ కళ్లను తెలుసుకోగలవు. అయితే అద్దం లేనప్పుడు కళ్లు ఉన్నట్లా, లేనట్లా? ఉన్నాయనుకుంటే ఆత్మ కూడా ఉన్నట్టే. ఆత్మ అద్దం లాంటిది

Published : 04 Aug 2022 01:21 IST

ఒక భక్తుడు ‘మీరు తరచుగా ఆత్మ అనే పదాన్ని వాడుతున్నారు. దాన్నెలా తెలుసుకోవడం?’ అనడిగాడు. దానికి రమణమహర్షి ‘అద్దంలో చూసినప్పుడు నీ కళ్లను తెలుసుకోగలవు. అయితే అద్దం లేనప్పుడు కళ్లు ఉన్నట్లా, లేనట్లా? ఉన్నాయనుకుంటే ఆత్మ కూడా ఉన్నట్టే. ఆత్మ అద్దం లాంటిది. నీలోకి నువ్వు తొంగి చూసుకుంటే అది కనిపిస్తుంది. ఆత్మ సాక్షాత్‌ ఈశ్వరుడే. గీతలో కృష్ణుడు ‘అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః’ అన్నాడు కదా! ఆత్మ, పరమాత్మ ఒకటి కాదనే సందేహం కలిగిందంటే మనలో ఇంకా అహంకార ఛాయలు వీడలేదని అర్థం. ఆత్మ శాశ్వతం. శాంతంగా ఉన్నప్పుడు ఆత్మ కనిపిస్తుంది. వయసు, ఈర్ష్య, మద, మాత్సర్యాలున్నప్పుడు ఆత్మను దర్శించలేం. ఈ సత్యాలను తెలుసుకున్నప్పుడే చూడగలం. మెలకువగా ఉన్నప్పటి దేహమే నిద్రలో సదరు భావన కోల్పోయి ఆత్మరూపం అవుతోంది. దేహ భావన పోవడమే ఆత్మ దర్శనానికి తొలి మెట్టు. దైవ లేదా ఆత్మ సాక్షాత్కారం అంటే ఒక కొత్త రూపాన్ని చూడటం కాదు, నిజానికి రెండూ ఒకటే. మీలో పలువురు మనసుని ఆత్మగా భ్రమిస్తున్నారు. కానీ అది సరి కాదు. మనసు జ్ఞాన రూప ప్రతిబింబం మాత్రమే. దీని నుంచి బయల్దేరే వాసనలు అసలైన ఆత్మ రూపాన్ని కనిపించకుండా అడ్డుపడుతున్నాయి. అందుకే మనసును అదుపుచేస్తే గానీ ఆత్మను దర్శించలేం’ అంటూ వివరించారు.                            

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని