నవగ్రహ ప్రదక్షిణలెలా?

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. ఈ ప్రదక్షిణాలపై ఎన్నో సందేహాలు భక్తులు వెలిబుచ్చడం చూస్తుంటాం. శాస్త్రంలో చెప్పినట్లు ప్రదక్షిణలు చేస్తే విశేష ఫలితం ఉంటుంది.

Published : 18 Aug 2022 01:21 IST

వగ్రహాలు చాలా శక్తివంతమైనవి. ఈ ప్రదక్షిణాలపై ఎన్నో సందేహాలు భక్తులు వెలిబుచ్చడం చూస్తుంటాం. శాస్త్రంలో చెప్పినట్లు ప్రదక్షిణలు చేస్తే విశేష ఫలితం ఉంటుంది. మన జీవన విధానం, మానసిక పరిస్థితులు అన్నీ గ్రహాలపైనే ఆధారపడి ఉంటాయని జ్యోతిశ్శాస్త్రం చెబుతోంది. జీవితంలో ఒడుదొడుకులు, కష్టసుఖాలు, లాభనష్టాలు- అన్నిటికీ గ్రహస్థితే కారణం. దాని నియమాలను చూద్దాం. శుచిగా స్నానం చేసి, ఆయా ఆలయాల్లో మూలవిరాట్టును దర్శించుకున్నాక మాత్రమే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాలను చేతితో తాకుతూ ప్రదక్షిణలు చేయకూడదు. సూర్యుణ్ణి చూస్తూ మండపంలోనికి ప్రవేశించి, ఎడమవైపు నుంచి (చంద్రుని వైపు) కుడివైపుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. అవి పూర్తికాగానే అసురులైన రాహువు, కేతువులను సంతృప్తి పరచేలా కుడి నుంచి ఎడమకు రెండు ప్రదక్షిణలు చేయాలి. చివరగా ఒక్కో గ్రహాన్ని స్మరిస్తూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసి వీపు భాగం కనిపించకుండా బయటకు రావాలి. ఇలా పద్ధతిననుసరించి చేసినవారికి సత్ఫలితాలుంటాయంటారు.

- చంద్రహాస్‌ చక్రవర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని