యాచన చాలించు...

ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (స) వద్దకు ఒక అనుచరుడు వచ్చి సాయం కోరగా, ‘మీ ఇంట్లో ఏ సామగ్రి ఉంది?’ అనడిగారు.

Updated : 01 Dec 2022 04:27 IST

ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (స) వద్దకు ఒక అనుచరుడు వచ్చి సాయం కోరగా, ‘మీ ఇంట్లో ఏ సామగ్రి ఉంది?’ అనడిగారు.
తమ ఇంట్లో బొంత పరుపు, నీళ్లు తాగే చెంబు మాత్రమే ఉన్నాయంటే వాటిని తీసుకురమ్మన్నారాయన. ప్రవక్త ఆ రెండు వస్తువుల్ని అమ్మగా వచ్చిన రెండు నాణాలను అతనికిస్తూ ‘ఒక నాణెంతో ఆహార పదార్థాలను కొని తీసుకెళ్లు. రెండో నాణెంతో గొడ్డలి కొని తీసుకురా’ అన్నారు. అతను తెచ్చిన గొడ్డలికి కర్రను తొడిగి ‘అడవికి  వెళ్లి కట్టెలు కొట్టి బజారులో అమ్ము. పక్షం తర్వాత వచ్చి కలువు’ అన్నారు. 15 రోజుల తర్వాత తన దగ్గర ఖర్చులన్నీ పోను 10దీనార్లు మిగిలాయంటూ సంతోషంగా చూపాడు. ప్రవక్త చిన్నగా నవ్వి ‘యాచిస్తూ తిరగడం, ఆ యాచన కారణంగా ప్రళయ దినాన నీ ముఖంపైన ఏర్పడే కళంకం కన్నా  ఈ కష్టార్జితమే ఎంతో మేలైంది’ అని హితవు పలికారు.                            

తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు