మౌఢ్యమి అంటే?

గురుగ్రహం లేదా శుక్రగ్రహం సూర్యుడితో కలిసుండే కాలం మౌఢ్యమి. దీన్నే వాడుకలో ‘మూఢమి’ అంటాం. మూఢమి అంటే చీకటి. మౌఢ్యకాలంలో సూర్యుడు అడ్డుగా ఉండటం వల్ల గ్రహాలు బలహీనంగా ఉంటాయి

Published : 01 Dec 2022 01:03 IST

గురుగ్రహం లేదా శుక్రగ్రహం సూర్యుడితో కలిసుండే కాలం మౌఢ్యమి. దీన్నే వాడుకలో ‘మూఢమి’ అంటాం. మూఢమి అంటే చీకటి. మౌఢ్యకాలంలో సూర్యుడు అడ్డుగా ఉండటం వల్ల గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పటి కంటే భూమికి మరోవైపుకు వెళ్లినప్పుడు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు సూర్యుడికి 12 డిగ్రీల దగ్గరికి వచ్చినప్పుడు తమ బలాన్ని కోల్పోతాయి. ఆ బలాన్ని రవి స్వీకరిస్తాడు.

మౌఢ్యమిలో పెళ్లిచూపులు, వివాహం, ఉపనయనం, గృహారంభం, గృహప్రవేశం, యజ్ఞాలు, మంత్రానుష్టానం, విగ్రహ ప్రతిష్టలు, వ్రతాలు, నూతనవధువు ప్రవేశం, వాహనం కొనడం, బావి లేదా చెరువు తవ్వటం, పుట్టువెంట్రుకలు తీయించడం, విద్యారంభ కార్యక్రమాలు, చెవులు కుట్టించడం, వ్యాపారాన్ని ఆరంభించడం లాంటి సమస్త శుభకార్యాలూ నిషిద్ధం. మౌఢ్యమి అనేది అన్ని గ్రహాలకూ ఉన్నప్పటికీ గురు, శుక్ర మౌఢ్యమి మనపై ప్రభావం చూపుతుంది. శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి బలం తగ్గుతుంది. సముద్ర ఆటుపోట్లలో పెను మార్పులొస్తాయి. భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. శుక్రుడు సంసార జీవితానికి కారకుడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. స్త్రీల మీద అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి.
జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతి, జప, హోమాది శాంతులు, గండ, నక్షత్ర శాంతులు, ఉత్సవాలు, సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి రోజుల్లో నిరభ్యంతరంగా చేయొచ్చు. గర్భిణులు, బాలింతలు మూఢమిలో ప్రయాణం చేయాల్సివస్తే శుభ తిథిలో అశ్వని, రేవతి నక్షత్రాల్లో, శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు