అల్లుడి కాళ్లెందుకు కడగాలి?!

భారతీయ సంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తన కంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి, ఆ నీటిని తన తలమీద, భార్య తలమీద చల్లుకోవడం తెలిసిందే

Published : 08 Dec 2022 00:46 IST

భారతీయ సంప్రదాయంలో పెళ్లి సమయంలో మామ తన కంటే ఎంతో చిన్నవాడైన అల్లుడి పాదాలను కడిగి, ఆ నీటిని తన తలమీద, భార్య తలమీద చల్లుకోవడం తెలిసిందే. ఇది వేదంలోనూ కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఇక్కడో రహస్యం ఉంది. ‘సాక్షాత్‌ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీమహాలక్ష్మీ స్వరూపి శ్రీం కన్యామ్‌’ అనేది వివాహమంత్రం. వివాహమైన రోజున ఈ వరుడు పేరుకి ఎవరైనా, వయసు ఎంతైనా అతడు లక్ష్మీనారాయణ స్వరూపుడే. శ్రీహరి పాదాల నుంచి గంగ పుట్టింది కనుక ఇతడి పాదాల నుంచి వచ్చే నీరు గంగతో సమానమని భావిస్తారు. వరుడి పాదాల నుంచి గంగ రాదు కనుక పాదాలను కడిగి తలమీద చల్లుకోవడం ఆనవాయితీగా మారింది. అలాగే వివాహమైన రోజున పెళ్లికూతురు మహాలక్ష్మీ స్వరూపిణియే. అందుకే ఆమెని చక్కగా అలంకరిస్తారు. ఆమె ఎందరి మధ్యలో ఉన్నా పెళ్లికూతురు ఎవరని అడిగే అవసరం రాకూడదనే ఆ ముస్తాబు. శాస్త్రం చెప్పిన ప్రకారం పెళ్లికి పిలవకపోయినా వెళ్లాలని, అందువల్ల శ్రీలక్ష్మీనారాయణులను దర్శించిన పుణ్యం వస్తుందని జ్ఞానసిద్ధులంటారు.
శివరాజేశ్వరి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు