మౌనమూ తపస్సే

‘మౌనేన కలహో నాస్తి’ అనేది నానుడి. మాటలు వెండి అయితే మౌనం బంగారం అన్నది సామెత. మాట్లాడక పోవడం ఎంత గొప్పదో తెలియజేస్తుందీ సూక్తి.

Updated : 15 Dec 2022 06:10 IST

‘మౌనేన కలహో నాస్తి’ అనేది నానుడి. మాటలు వెండి అయితే మౌనం బంగారం అన్నది సామెత. మాట్లాడక పోవడం ఎంత గొప్పదో తెలియజేస్తుందీ సూక్తి. మౌనంగా ఉండటం వల్ల అంతులేని మనశ్శాంతి లభిస్తుంది. అందుకే దాన్ని తపస్సు అంటారు. అయితే ఇక్కడో ధర్మ సూక్ష్మం గమనించాలి. అభాషణం అనేది అన్ని సందర్భాల్లో, అందరికీ పనికిరాదని సుభాషితాలు చెబుతున్నాయి. ‘మౌనాన్మూర్ఖః ప్రవచన పటుః వాతులో జల్పకోవా’ అన్నాడు భర్తృహరి. ఎప్పుడూ మాట్లాడని వ్యక్తిని మూర్ఖుడు, గర్విష్టి అనుకునే ప్రమాదం ఉంది. సదా మాట్లాడుతూనే ఉంటే వదరుబోతు, వాగుడుకాయ అని హేళన చేయడమూ కద్దు. అందుకే విజ్ఞులు సందర్భాను సారంగా మెలగాలి. ఎప్పుడైనా మితభాషణమే భూషణం. అంటే తక్కువగా మాట్లాడటం, అవి మంచి మాటలే అయ్యుండటం శ్రేయోదాయకం అన్నారు పండితులు.                      
 టి.నాగరాజు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని