తిరుమలలో మొదటి గడప అతడే

ఇష్టదైవాన్ని నమ్మినంతలో సరిపోదు, నిరంతరం స్మరించాలి. ఇదేమీ అనుకున్నంత తేలిక కాదు. అలా మదిలో ధ్యానిస్తూ నిత్యకర్మలు చేసేవారే నిజమైన భక్తులు

Published : 12 Jan 2023 00:27 IST

మీకు తెలుసా

ఇష్టదైవాన్ని నమ్మినంతలో సరిపోదు, నిరంతరం స్మరించాలి. ఇదేమీ అనుకున్నంత తేలిక కాదు. అలా మదిలో ధ్యానిస్తూ నిత్యకర్మలు చేసేవారే నిజమైన భక్తులు. అలాంటి భక్తుడు కేరళరాజు దృఢవ్రతుని కుమారుడు కులశేఖర ఆళ్వార్‌. ఇతడు రాజ్యపాలన చేస్తూనే దైవ ధ్యానం చేసేవాడు. అతడోసారి రామాయణ గాథ వింటున్నాడు. యుద్ధ ప్రసక్తి రాగానే.. కులశేఖరుడు గబుక్కున లేచి ‘మనం కూడా యుద్ధానికి సిద్ధం కావాలి’ అనడంతో అంతా ఆశ్చర్యపోయారు! ఇంతలో వేద పండితులు రామరావణ యుద్ధం ముగిసింది, రాముడు విజయం సాధించాడు- అంటూ చెప్పారు. ‘రాముడు విజయం సాధించాడు, ఇక మన సైన్యం వెళ్లనవసరం లేదు’ అన్నాడు కులశేఖరుడు. రాజు భక్తిపారవశ్యంలో అలా అన్నాడని అర్థమైంది. కులశేఖరుడి ‘ముకుంద మాల’, 105 పాశురాల ‘పెరుమాళ్‌ తిరుమొళి’ భక్తులకు పావన గ్రంథాలు. వీరికి వేదపండితులు ద్విజన్మవర, పద్మాశరులు సహచరులు. తిరుమల ఆలయంలో ప్రథమ గడపగా ఉండే వరాన్ని పొందాడు. అందుకే గర్భగుడికి ముందున్న గడపని ‘కులశేఖర ఆళ్వార్‌ గడప’ అంటారు.
బెహరా ఉమామహేశ్వర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని