గోవుతో గృహప్రవేశం ఎందుకు?

మనందరికీ సొంతింట్లో నివసించాలనిపిస్తుంది. ఆ స్వగృహ కల నెరవేరినప్పుడు బంధుమిత్రుల్ని పిలిచి గృహప్రవేశ వేడుక చేసుకుంటాం.

Updated : 09 Feb 2023 02:18 IST

నందరికీ సొంతింట్లో నివసించాలనిపిస్తుంది. ఆ స్వగృహ కల నెరవేరినప్పుడు బంధుమిత్రుల్ని పిలిచి గృహప్రవేశ వేడుక చేసుకుంటాం. ఆ వేడుకలో మొదటి ఆచారం దూడతో సహా గోమాతను నూతన గృహంలోకి తీసుకెళ్లి మంత్రం జపిస్తూ ఇల్లంతా తిప్పడం. ఆ తర్వాతే ఇంటి యజమాని, ఇతర కుటుంబ సభ్యులు లోనికి వెళ్తారు. ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్య మేమిటో చూద్దాం...

పురాణాలూ ఇతిహాసాలూ గోవును సకలదేవతా స్వరూపంగా వర్ణించాయి. గోవు ఉన్నచోట సకల దేవతలూ ఉంటారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అందువల్ల ఆవును తీసుకెళ్తే.. దేవతలూ గృహంలో ప్రవేశిస్తారన్నమాట. అందుకే కొత్తింట్లో గోవును తిప్పటం ఆచారమయ్యింది. ఆ సమయంలో గోవు మూత్రం పోసినా, పేడ వేసినా మరింత శుభకరంగా భావిస్తారు. ప్రస్తుత కాలంలో బహుళ అంతస్తుల్లో గోవును తిప్పటం కుదరదు కనుక ఆ ప్రాంగణంలో ఆవూదూడలను అలంకరించి పూజిస్తారు. గోమయాన్ని, గోమూత్రాన్ని ఇంట్లో చిలకరిస్తారు.

దూర్తి సుబ్రహ్మణ్య కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని