ఎవరు స్వర్గానికెళ్తారు?

ఒకసారి ప్రవక్త మహనీయులు (స) స్వర్గం గురించి ప్రస్తావిస్తూ దాని వైశాల్యాన్ని, అందలి భోగభాగ్యాలను వివరించారు. ఆయన మాటలు ఆలకించిన ఒక పల్లెటూరి వ్యక్తి ఆశ్చర్యపోయి.. ‘ప్రవక్త మహాశయా!

Updated : 09 Feb 2023 02:15 IST

కసారి ప్రవక్త మహనీయులు (స) స్వర్గం గురించి ప్రస్తావిస్తూ దాని వైశాల్యాన్ని, అందలి భోగభాగ్యాలను వివరించారు. ఆయన మాటలు ఆలకించిన ఒక పల్లెటూరి వ్యక్తి ఆశ్చర్యపోయి.. ‘ప్రవక్త మహాశయా! ఇంతకీ ఈ స్వర్గం ఎవరికి లభిస్తుంది?’ అనడిగాడు. దానికి బదులిస్తూ ‘మృదుభాషులకి, ఆకలిగొన్నవారికి అన్నం పెట్టే వారికి, దానధర్మాలు చేసేవారికి, ఉపవాసాలు పాటించేవారికి, లోకమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో నమాజులు చేసేవారికి, మంచి మాటలు మాట్లాడేవారికి స్వర్గం లభిస్తుంది. ఒక మంచి మాట కూడా దానంతో సమానమే మరి’ అన్నారు ప్రవక్త.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని